అక్రమ ఫైనాన్స్ ల పై రామగుండం పోలీస్ ఉక్కుపాదం…

0
1690

రామగుండం కమిషనరేట్, V.Dinesh

రామగుండం పోలీసు కమిషనరేట్ లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న 49 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.

వారి నుండి సుమారు 65.52 లక్షల రూపాయలు, ప్రాంసరినోట్స్-1235, బ్లాంక్ చెక్ లు -1019, ఎటిఎం కార్డ్స్-347, బాండ్ పేపర్స్-175, ల్యాండ్ పేపర్స్-23, పట్టా పాస్ బుక్స్-9లు  స్వాధీనం చేసుకొన్నారు.

పరారీలో మరో 70 మంది అక్రమ ఫైనాన్స్ నిర్వహకులు ఉన్నారు.ఈ మేరకు స్థానిక ఎల్లందు గెస్టుహౌస్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ అక్రమ పైనాన్స్, చిట్టి వ్యాపారాలు చేస్తున్న వివరాలను వెల్లడించారు.

గిరిగిరి (డైలీ ఫైనాన్సు) దందాపై పూర్తి స్థాయిలో నిఘా చేస్తున్నామని, త్వరలో మరిన్ని అరెస్ట్ లు చేస్తామన్నారు.కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి  జిల్లాలలో అక్రమ ఫైనాన్సు, వడ్డీ వ్యాపారం చేస్తున్నవారిపై నిఘా పెట్టి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించినతర్వాత కమిషనరేట్ పరిధి లో టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ , సిసిఎస్, స్థానిక పోలీస్ లతో (60) బృందాలు వివిధ ప్రాంతాలలో అధిక వడ్డిలు వసూలు చేస్తున్న వ్యక్తుల ఆఫీసులపై ,ఇండ్లపై దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.

నిందితుల వివరములు:

మంచిర్యాల టౌన్  పోలీస్ స్టేషన్ పరిడిలో..1.పవన్ కుమార్ తివారీ s/o మంగిలాల్ జీ,మంచిర్యాల్ (శ్రీ లక్ష్మి  హైర్ పర్చేజ్ & కమర్షియల్ ఫైనాన్సు)2.సందిరెడ్డి శ్రీనివాస్ s/oవెంకటప్పయ్య ,మంచిర్యాల్ ,(పద్మ ప్రియ ఫైనాన్సు)3.గుమ్మడి మస్తాన్ యాదవ్ s/o వెంకటేశ్వర్లు యాదవ్ ,మంచిర్యాల్ ( శ్రీ వెంకటేశ్వరా ఫైనాన్సు)4.వెంపటి సత్యనారాయణ s/o నరసింహ స్వామి (నవరత్న HP ఫైనాన్సు)5.పడాల అశోక్ బాబు s/o కుమారస్వామి ,కృష్ణ నగర్ ఎన్టిపిసి ,(రామాంజనేయ HP ఫైనాన్సు)6.సుజిత్ కుమార్ s/o సుబాష్ ,మంచిర్యాల ,(శ్రీసాయి ఫైనాన్సు)7.అందరి రమేష్ s/o ఐలయ్య ,మంచిర్యాల్ (లక్ష్మి గణపతి ఫైనాన్సు)8.నేరెల్లి సాయి కృష్ణ s/o ….,మంచిర్యాల్ ,(శ్రీ సింగరేణి చిట్స్ ప్రైవేటులిమిటెడ్)9.రావికంటి సతీష్ s/o వెంకటేశ్వర్లు,మంచిర్యాల్ (శ్రీ లక్ష్మి HP ఫైనాన్సు)10.బట్టు రవి కుమార్ s/o మల్లయ్య ,మంచిర్యాల్ (వైష్ణవి HP ఫైనాన్సు)11.ఎగ్గు శ్రీనివాస్ s/o శ్రీనివాస్ ,సిసిసి  నస్పూర్  (స్నేహాంజలి HP ఫైనాన్సు)12.ముదం రమేష్ s/o మల్లయ్య ,మందమర్రి (విజయ శ్రీ ఫైనాన్సు)
సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో: 13.గజ్జేల్లి  గణేష్ s/o కొండయ్య ,సిసిసి నస్పూర్ (అమ్మ  హైర్ పర్చేజ్& ఫైనాన్సు)బెల్లంపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో….14.కుదిరపాక సత్యనారాయణ s/o వీరస్వామి ,బెల్లంపల్లి (శ్రీ వైష్ణవి హైర్ పర్చేజ్& ఫైనాన్సు)15.నగరపు రామయ్య s/o తిరుపయ్య ,బెల్లంపల్లి 16.చింతనిప్పుల రమేష్ s/o రాయమల్లు ,బెల్లంపల్లి (లక్ష్మి వెంకటేశ్వరా హైర్ పర్చేజ్& ఫైనాన్సు) తాండూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో :17.మద్దికుంట రామచందర్ s/o మొగిలయ్య ,ఐబి తాండూర్,(శ్రీ లక్ష్మి గణపతి హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిదిలో… .18.ఆది దేవేందర్ s/o చంద్రయ్య ,మందమర్రి (మారుతీ ఫైనాన్సు)
19.బత్తుల శంకర్ s/o వెంకటేశం,మందమర్రి,(శ్రీ మెడికల్ షాప్ )బెల్లంపల్లి ఐ టౌన్  పోలీస్ స్టేషన్ పరిధిలో…20.పోతురాజు మంగమూర్తి బెల్లంపల్లి (వేద హైర్ పర్చేజ్& ఫైనాన్సు)చెన్నూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో…21.బండారి సంతోష్ ,22.కోమటిపల్లి రమేష్ ,23.గాదె రాజన్న ,24.పోగుల చంద్రశేకర్ 25.పోగుల్ ఆనంద్ 26.కుందారపు రవీందర్  27. చెన్నం సంతోష్ 28.మాసినేని లక్ష్మన్ 29.పోగులు సంతోష్ ,30. చింతల సుదర్శన్(శ్రీలక్ష్మి హైర్ పర్చేజ్& ఫైనాన్సు)
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో…౩1.మడికొండ సదాశివ s/o సాంబయ్య పెద్దపల్లి 32.కోలేటి ప్రసాద్ s/o నాగలింగం ,పెద్దపల్లి 
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో..33.పర్స వెంకటేశ్వర్లు s/o లింగయ్య గోదావరిఖని
34.వేముల శ్రీనివాస్ s/o నర్సయ్య  గోదావరిఖని35.పొన్నం విజయ్ కుమార్  గౌడ్ s/o ఎల్ల గౌడ్36.మహంకాళి స్వామి s/o దుర్గయ్య గోదావరిఖని౩7 .పొన్నం లక్ష్మయ్య గౌడ్ s/o మల్లయ్య గోదావరిఖని38.కాసాని శ్రీనివాస్ s/o నర్సయ్య గోదావరిఖని39.అడవెల్లి రవీందర్ రెడ్డి s/o సాయి రెడ్డి గోదావరిఖని40.అవనిగంటి ఎల్లేష్ s/o యాదగిరి గోదావరిఖని41.కోరం రవీందర్ రెడ్డి s/o నరసింహ రెడ్డి గోదావరిఖని42.అనుమ సత్యనారాయణ s/o లక్ష్మయ్య గోదావరిఖని43.గుర్రం శ్రీనివాస్ s/o వీరయ్య గోదావరిఖని44.మంత్రి శ్యాం సుందర్ s/o బాబులాల్ గోదావరిఖని
ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో…45.బేతి రామచంద్ర రెడ్డి s/o నారాయణ రెడ్డి, గౌతం నగర్ ఎన్టిపిసి 46.బిడిదా మహేందర్ s/o లక్ష్మయ్య,సిసిసి నస్పూర్ గోదావరిఖని టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో…47.పంజాల సదానందం s/o వీరయ్య ,8 ఇంక్లైన్ కాలనీ 48.పోలవేణి రమేష్ s/o కోమురయ్య 8 ఇంక్లైన్ కాలనీ49.అనంతుల రాజు s/o జగదీశ్వర్ , 8 ఇంక్లైన్ కాలనీ
👉పరారిలో ఇంకా  (70 ) మంది అక్రమ ఫైనాన్సు నిర్వాహకులున్నారు..
వారి వద్ద 65.52 లక్షల రూ”ల నగదును స్వాధీన పరుచుకున్నారు.
👉ఇంకా విచారణ జరుగుతుందని, సాక్ష్యాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారని అన్నారు.         అక్రమ ఫైనాన్స్ లపై ఇంకా పూర్తిస్థాయి విచారాణ  కొనసాగుతుంది. ఎవరెవరున్నారు , ఎంత మొత్తంలో  డబ్బులు పెట్టారు , ఎవరెవరితో సంబందాలు ఉన్నాయి, వీరికి డబ్బు ఎలా వస్తుంది అని పలు సాక్ష్యాల సేకరణ చేయడం జరుగుతొందన్నారు..పూర్తి విచారణ తరువాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
విచారణ కొనసాగుతున్న  ఫైనాన్స్ ల జాబితా ను వివరిస్తూ…..
1. కనకదుర్గ ఫైనాన్స్ మంచిర్యాల 2. వేదశ్రీ ,  ఫైనాన్స్, లక్ష్టేటిపేట్3. వెంకటేశ్వరా ఫైనాన్స్ లక్ష్టేటిపేట్4. లలిత ఆదిత్య చిట్ ఫండ్ మందమర్రి 5. నిత్య శ్రీ హై పర్చేజ్ & ఫైనాన్స్ 6. నాగలక్ష్మి HP ఫైనాన్స్ మందమర్రి 7. భవిత శ్రీ చిట్ ఫండ్ ఎన్టిపిసి 8. కర్రే శ్రీనివాస్ ఫైనాన్స్ గోదావరిఖని 9. ముడతలపల్లి ప్రవీణ్ కుమార్ గోదావరిఖని 10. రాదే శ్యాం లోయ గోదావరిఖని11. గౌడిశెట్టి రంగయ్య గోదావరిఖని ఇవే కాకుండా రామగుండము కమీషనరేట్ పరిధి లోని మంచిర్యాల ,పెద్దపల్లి జిల్లాలలో ఇంకా సుమారు 150 వరకు అక్రమ ఫైనాన్స్ నిర్వహిస్తున్నట్టు గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించి వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడునని తెలిపారు.రామగుండం కమిషనరేట్ పరిధిలో కొంతమంది ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వాహనాల కొనగోలుకు , వ్యక్తిగత అవసరాలకోసం అప్పుతీసుకొనే సమయంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయిoచు కుంటున్నారని, పత్రాలలో పూర్తి వివరములు రాయకుండానే సంతకాలు తీసుకుంటు, అప్పులు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఇంకా బ్యాంకు అకౌంట్ బుక్ ,ఏటీఎం కార్డు,చెక్ బుక్ స్వాదీనం చేసుకొని ,ప్రాంసరి నోట్రాపించుకుంటున్నారనీ, రూ.100 కు 5 నుండి  రూ.10 చొప్పున అధిక వడ్డీలు వసూలు చేయడం జరుగుతుంది….పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే భూముల పేపర్లు ,ఇంటి పత్రాలు తీసుకోని డబ్బులుఇస్తున్నారు…అవసరాలకోసం ప్రజలు తప్పక, డబ్బులు తీసుకొని, అధిక మొత్తంలో వడ్డీలు, ఇక గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండిన తర్వాత చెల్లించినా ఫర్వాలేదంటున్నారు. అయితే రైతులు పంట దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర రాకపోవడంతో తీసుకున్న అప్పు తీర్చలేక.. ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలున్నాయన్నారు.. అనుమతులు లేకుండా గిరిగిరి ఫైనాన్స్, ఆటోఫైనాన్సు (నెలవారీ)లు ఉన్నాయని, చాలా మంది ఉదయం తీసుకోని సాయంత్రం చెల్లించేందుకు 10 శాతం నుండి 20 శాతం వడ్డీ చొప్పున వడ్డి వసూలు  చేస్తున్నారరని, అలాగే వాహనాలు ,బంగారు ఆభరణాలు తనఖా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నారన్నారు..
రికవరీ గుండాల రుస్తుం గిరి చెల్లదు…అప్పుల రికవరీ కోసం ప్రైవేటు ఫైనాన్సు యజమానులు రికవరీ సిబ్బందిని ఏర్పరుచుకొని కమిషన్ పై  పాత బాకీలు వసూలు చేయడం ,ఒక వేళ వారు కట్టని ఎడల వారిని బెదిరించడం తిట్టడం అందరి ముందు అవమాన పరచడం ,పరువు తీయడం ,స్త్రీలను అగౌరవ పరచడం ,అవసరమైతే కిడ్నాప్ లకు పాల్పడడం,దాడులకు పాల్పడి వారిని మానసిక ,శారీరక హింసలకు గురి చేయడం జరుగుతుందని మా విచారణలో తేలింది.అలా ప్రజలను అవమానానికి గురిచేసి,కృంగుబాటుకు గురిచేస్తున్న రికవరీ గుండాలకు కళ్ళెంవేస్తాం.వారిని కటకటాల వెనక్కు పంపించండంతోపాటు పిడి యాక్ట్ ప్రయోగిస్తామని  సిపి సత్యనారాయణ హెచ్చరించారు.అక్రమ ఫైనాన్సు దందాపై ఇంకా లోతుగా ఆరా తీయడం  జరుగుతుందని ,అక్రమ వ్యాపారంలో ప్రముఖుల హస్తం ఉందని మా విచారణలో తేలిందని ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరములు త్వరలోనే వెల్లడిస్తాం అని సిపి సత్యనారాయణ అన్నారు .
ఫైనాన్స్ నిర్వహించాలంటే ఈ క్రింది నిబంధనలు తప్పక పాటించాలని వివరిస్తూ… .ఫైనాన్స్ పేరుతో రిజిస్ట్రేషన్ నమోదై ఉండాలి.• ఫైనాన్స్ పేరిట ట్యాన్, పాన్ కార్డు తప్పనిసరి*మని లెండింగ్ లైసెన్ తప్పని సరి తీసుకోవాలి • బ్యాంకు ఖాతా ద్వారానే లావాదేవీలు నడపాలి ఆదాయ పన్ను రికార్డులు ఏటా ఫైనాన్స్ ఆడిటింగ్ చేయించి సంబంధిత అధికారులకుఅందజేయాలి..• ఫైనాన్స్ కార్యాలయానికి లీజ్ డీడ్ తప్పనిసరీగా యజమాని చేయించుకోవాలి.అప్పు తీసుకోవడం ,ఇవ్వడం నేరం కాదని,రిజర్వ్ బ్యాంక్ నియమనిబందనలు, తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్తో అప్పులు ఇవ్వవచ్చని, తీసుకోవచ్చని, కానీ చట్ట విరుద్ధంగా, దోపిడీ వడ్డీ రేట్లతో సామాన్యుల నడ్డివిరిచి వారిపై దౌర్జన్యం లను చేసే వారె మా టార్గెట్ అని, ఆస్తులు కబ్జా చేసి,కాజేసి ,స్త్రీలు,పెద్దవారిని అవమానిస్తే వారు కఠినం గా చట్టపరంగా శిక్షించబడతారని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మరిన్ని దాడులు చేస్తాం..నకిలీ పత్తి విత్తనాలు , కలప అక్రమ రవాణా, చిట్ ఫండ్, ఫైనాన్స్, పలు వ్యభిచార గృహాలపైనా అలాగే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలలో నిషేదిత గుట్కా,ఇసుక అక్రమ రవాణా ,కల్తీ ఆహర పదార్థాలు,భూ మాఫియా ,రౌడియిజం,ఇంకా  మరిన్ని అక్రమ వ్యాపారా  దందాలపై ఉక్కుపాదం మోపుతాం అన్నారు. జాబితా సిద్దం చేస్తున్నాం….ఏ తరహా అక్రమాలకు పాల్పడ్డా ఉపేక్షించే లేదని హెచ్చరించారు.కమీషనరేట్ పరిదిలో ప్రజలకు పోలీసుల మైన మేము  ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము అని సాదారణ జీవితం గడిపే వారికీ మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ నేరాలకు పాల్పడే వారికీ ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికీ కాదని అన్నారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ వారి స్వేచ్ఛా భంగం కలిగేంచే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ప్రజల భద్రతే తెలంగాణా పోలీసు లక్ష్యం అందరూ సురక్షితంగా ఉండాలని ఆకాక్షించారు.. ఈ సమావేశంలో పెద్దపల్లి, మంచిర్యాల డిసిపి రక్షిత కె మూర్తి, సుదర్శన్ గౌడ్, ఏసీపీ గౌస్ బాబా, ఉమెందర్, అశోక్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here