“అక్షరాగ్ని” అలిశెట్టి ప్రభాకర్ జయంతి-వర్ధంతి సందర్భంగా…. దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి ఆధ్వర్యంలో నివాళులు

0
105

IMG-20190112-WA0559

దుబాయ్, sircilla srinivas, 9849162111


అక్షరాగ్ని” అలిశెట్టి ప్రభాకర్  జయంతి-వర్ధంతి సందర్భంగా దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం  నివాళులు అర్పించడం జరిగింది.

IMG-20190112-WA0798

దుబాయ్ లోని జాబీల పార్క్ లో సేవా సమితి సభ్యులు అంతా కలుసుకుని, అరుదైన కవి అలిశెట్టి ప్రభాకర్  జయంతి – వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుని అలిశెట్టి గురించి చర్చించుకోవడం  జరిగింది.

సమాజం పట్ల అతడికి ఉన్న భాద్యత, సమాజంలో మార్పు కోసం అతడి కవితల్నె ఆయుధాలుగా అతడి మాటలే తూటాలుగా చేసుకుని చేసిన పోరాటం నిజంగా ప్రతీ ఒక్క యువకుడిని ఉత్సాహ పరుస్తుంది,

సమాజాన్ని మార్చాలనుకునే లక్షలాది మంది సామాన్య యువతరంలా అలిశెట్టి  కూడా 70-80 దశకంలో వామపక్ష భావాలకు ఆకర్షితుడై, తనకున్న ఆస్తిపాస్తులను అమ్ముకుంటూ, తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిస్తూ, సమాజాన్ని మార్చాలని ప్రయత్నించిన నిత్య పోరాట వీరుడు అలిశెట్టి,

తన ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చి, భావాలే తూటాలుగా సమాజాన్ని మార్చగలనని మనసా వాచా నమ్మిన అక్షరయోధుడు అలిశెట్టి ప్రభాకర్,

ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి రోజు దుబాయ్ ఏలాల శ్రీనన్న సేవాసమితి సభ్యలం అంతా తెలుసుకుని అతడ్ని స్మరించుకోవడం వల్ల మాకు సమాజం పట్ల ఇంకా ఏదో చేయాలి అనే తపన తెలిపారు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని తెలిపారు.