అమెరికాలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులువిద్యార్థులు తమ ప్రతిభా నైపుణ్యాలను ఇక్కడి కంపెనీల అభివృద్ధి కోసం వినియోగించాలి – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

0
58

వాషింగ్టన్‌ :

విద్యార్థులు తమ ప్రతిభా నైపుణ్యాలను ఇక్కడి కంపెనీల అభివృద్ధి కోసం వినియోగించాలని అమెరికాలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ దేశంలోనే ఉండిపోవాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు.

trumph

శనివారం ఆయన వైట్‌హౌ్‌సలో మీడియాతో మాట్లాడారు….ఈ సందర్భంగా మరోసారి చట్టబద్ధ వలసల తీరుపై మండిపడ్డారు. పరిహాసప్రాయ వలస విధానాల వల్ల గొప్ప మేధస్సులను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బయట దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారికి ప్రతిభే గీటురాయి కావాలని తన ప్రభుత్వం కోరుకుంటోందని తెలిపారు.

file photo students
(file photo students)

అలాంటి వారు ఇక్కడి కంపెనీలు, సంస్థల్లో పనిచేసే వాతావరణం ఉండాలన్న ఆయన దీనికోసం చట్టబద్ధ వలస వ్యవస్థలోని లోపాలను వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.

అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో విద్యను ఆర్జించిన విదేశీ విద్యార్థులు జపాన్‌, చైనా వంటి బయట దేశాలకు వెళ్లి పని చేస్తుండటం విచారకరమన్నారు. ‘‘మనకు గొప్ప వ్యక్తులు కావాలి. అయితే, వారంతా ప్రతిభ ఆధారంగానే రావాలి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న పద్ధతుల్లో వస్తామంటే మాత్రం మాకు అక్కర్లేదు’’ అని స్పష్టం చేశారు.

అమెరికాలోని అత్యున్నత విద్యాసంస్థల్లో చదివి, మంచి ప్రతిభ ఉన్నవారిని దేశంలోనే ఉండేలా చేయలేకపోతున్నామని ప్రతిష్ఠాత్మకమైన ఐటీ కంపెనీలు తనకు ఫోన్‌ చేసి బాధ పడుతున్నాయని తెలిపారు.

అమెరికా విద్యా సంస్థల్లో చేరి, జ్ఞానం పెంచుకొని, ప్రతిభకు మెరుగులు దిద్దుకొన్న వారిని నిలబెట్టుకొనే వాతావరణం గానీ, వారి ప్రతిభకు తగిన గౌరవం దొరుకుతుందన్న హామీగానీ లేకుండా పోయిందని బాధపడ్డారు.

కాలిఫోర్నియాలో భారతీయ సంతతి పోలీసు అధికారి రొనిల్‌ రోన్‌ సింగ్‌ కాల్చివేతపై ట్రంప్‌ స్పందిస్తూ.. అది అక్రమ వలసదారు పని అని మండిపడ్డారు. కాగా, సరిహద్దుల బలోపేతంపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను డెమొక్రటిక్‌ పార్టీ ఎంపీ రాజా కృష్ణమూర్తి సమర్థించారు.

మెక్సికోతో పంచుకొంటున్న అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గోడ కట్టాలని ట్రంప్‌ చాలాకాలంగా వాదిస్తున్నారు. అలాంటి భౌతిక నియంత్రణ సరిహద్దుల్లో అవసరమేనని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.