అయ్యప్ప భక్తులపై కేరళ పోలీస్ జులుం..

0
119

www.telaganareporter.news✍9394328296

అయ్యప్ప భక్తులపై కేరళ పోలీస్ జులుం..

👉కేరళ పోలీసులను ముచ్చెమటలు పట్టించిన ఖని కాషాయ నాయకుడు

కెరళ, జనవరి-19, తెలంగాణ రిపోర్టర్:- స్వామి దర్శనం లో భాగంగా కేరళ లో వివిధ ఆలయాలను దర్శించుకునే అయ్యాప్ప భక్తులను కేరళ నాస్తిక ప్రభుత్వ పోలీసులు జులుం చూపెట్టిన తీరు ఆందోళనకు గురిచేసింది.. అయ్యాప్ప దీక్షలో 41 రోజులు(మండల) పాటు నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఉన్న స్వాములు శబరిమల స్వామి ని దర్శించుకొంటారు.. అయితే ఈ మధ్య కేరళ కోర్టు అయ్యాప్ప దేవాలయంపై ఓ సంఘటన గా తీర్పును వెలువరించింది.. దీనితో ప్రభుత్వం, పోలీసులు ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలతో అయ్యాప్ప దీక్షపరులపై పలు రకాల ఆంక్షలు పెట్టడం తో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు స్వాములు ఆందోళన చెందారు.. శబరిమల ప్రయాణంలో అయ్యప్ప ను దర్శించుకునే స్వాములను చిన్నపాదం లో కేరళ పోలీసులు అధికార దర్పణంతో తమ విధులను ఏకపక్షంగా వ్యవహరిస్తూ భక్తులపై పలు దుర్భాశాలు చేసినట్లు తెలిసింది. అలాగే శబరిమల దేవాస్తానం బోర్డ్ తెలుగు రాష్ట్రాల అయ్యాప్ప భక్తులకు కల్పించే సౌకర్యాలలో శూన్యం అని స్వాములు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వాములు తెస్తున్న ఇరుముడి, మొక్కు బడులు తదితర రూపాల్లో మొక్కుబడులు చెల్లించుకొంటారు. కోట్లాది రూ”లు తెలుగు రాష్ట్రాల నుంచి ఆదాయం వస్తున్న ఇక్కడి దేవస్తాన బోర్డ్ మాత్రం వీరికి ఇచ్చే సౌకర్యాలు ఏమి లేవని చెపుకోవచ్చు.. అయ్యాప్ప డేవాలయంలోకి మహిళల ప్రవేశం కోర్ట్ తీర్పుతో ప్రభుత్వ పోలీసులు భక్తులపై మరింత రెచ్చిపోయినట్లు సమాచారం.. శబరిమల లో తెలుగు రాష్ట్రాల భక్తులకు సదుపాయాలు, సౌకర్యాలు దేవస్థానం ఏ మాత్రం అందించలేకపోవడం తో రోడ్లపై పడుకోవడం, మాల, మూత్ర శాలలు లేక ,ఇలా ఎన్నో సదుపాయాలు అందించలేక భక్తులు సతమతమవుతున్న తీరు వర్ణనాతీతం.. ఇంతే కాక ఇక్కడి పోలీసుల చేస్తున్న జులుo తీరుతో తెలుగు రాష్ట్రాల స్వాములను ఆందోళనకు గురిచేస్తోంది..

జక్కుల నరహరి
జక్కుల నరహరి

👉కేరళ పోలీసులను ముచ్చెమటలు పట్టించిన ఖని కాషాయ నాయకుడు..

శబరిమల యాత్రలో శ్రీ అయ్యాప్ప స్వామి ని దర్శించుకొనే స్వాములను కేరళ పోలీసులు నాస్తికతను చూపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 17 న స్వామితో పాటు వివిధ ఆలయాలను దర్శించుకొనేoదుకు వెళ్లిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన బిజెపి నాయకుడు జక్కుల నరహరికి చెంగానూర్ దేవాలయం లో చేదు అనుభవం ఎదురైనట్లు తెలిసింది. తన భక్త బృందంతో శబరిమల దర్శనం చేసుకొని చెంగానూర్ లోని భగవతి ఆలయం లో రాత్రి పడుకున్న సమయంలో అక్కడ పోలీసులు అయ్యాప్ప దీక్షపరులపై జులుం చూపెట్టినట్లు, స్వాముల బ్యాగులను ఇష్టానుసారంగా పడేయడంతో నరహరి చలించి నాస్తిక ప్రభుత్వ పోలీసుల తీరుపై స్పందించారు. అయ్యాప్ప స్వాములను సపోర్ట్ చేస్తున్న నరహరి ని పలు రకాలుగా పోలీసులు దూషించడంతో నరహరి వెంటనే పార్టీ, అనుబంధ భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ శ్రేణులకు సమాచారం అందించడంతో వారు నరహరి ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసారు. కాని వారి ప్రయత్నం విఫలం కావడం తో తోక ముడిచి వెళ్లిపోయినట్లు సమాచారం..