అలిశెట్టి కవిత్వం అజరామరమైనది….ఎమ్మెల్యే సంజయ్ కుమార్

0
119

కళా శ్రీ ఆర్ట్ థియేటర్స్ గుండేటి రాజు, రేగొండ నరేష్, అలిశెట్టి రాజు ఆధ్వర్యంలో…

జగిత్యాల…sircilla srinivas, 9849162111


IMG-20190112-WA0645

అక్షర సూరీడు అలిశెట్టి కవిత్వం అజరామరమైనదని, చిన్న కవితలలో గొప్ప భావాన్ని వ్యక్తీకరించారని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు.

IMG-20190112-WA0650

శనివారం జగిత్యాల పెన్షనర్స్ భవన్ లో కళా శ్రీ ఆర్ట్ థియేటర్స్ గుండేటి రాజు, రేగొండ నరేష్, అలిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అలిశెట్టి ప్రభాకర్ స్మారక రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్పందిస్తూ… ప్రభాకర్ జగిత్యాల వాసి అయినందుకు గర్వంగా ఉందని అన్నారు.

IMG-20190112-WA0591

ముఖ్యమంత్రి కెసిఆర్ సాహిత్యాభిమాని అవడం తెలంగాణ ఏర్పాటు కావడం వలన అలిశెట్టి కి గొప్ప గౌరవం లభించిందని ఆయన కవిత పదవ తరగతి పాఠ్యపుస్తకాలలో చోటు చేసుకోవడం ద్వారా… భవిష్యత్ తరాలు అలిశెట్టి గురించి తెలుసుకునే అవకాశం కలిగిందని అన్నారు.

IMG-20190112-WA0623 (అసోసియేట్ ప్రొఫెసర్ (హైదరాబాద్) డాక్టర్ జ్యోత్స్న ప్రభ)

సమాజంలోని అసమానతలను అలిశెట్టి తన కవితలలో నిరసించారనీ పేర్కొన్నారు.  దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే పరమపదించారని, ఆయన పుట్టిన రోజు మరణించిన రోజు ఒకే రోజు అవడం యాదృచ్చిక మని అన్నారు.

IMG-20190112-WA0612(శ్రీమతి కొలిపాక శోభారాణి)

తొలుత అలిశెట్టి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

IMG-20190112-WA0652(శ్రీమతి చిందం సునీత)

కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్.పి మురళీధర్ మాట్లాడుతూ… “రాజు మరణించి ఒక తార రాలిపోయే…” అని జాషువా కవితను ఉదహరించి, మంచి కవులు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి వారిలో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు తెలిపారు.

IMG-20190112-WA0638(దాసరి శాంత కుమారి)

ఈ సందర్భంగా స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ స్మారక రాష్ట్రస్థాయి పురస్కారాన్ని కవయిత్రి, రచయిత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (హైదరాబాద్) డాక్టర్ జ్యోత్స్న ప్రభ కు ప్రధానం చేశారు . అలాగే మహిళా సాహిత్య పురస్కారాలను కవయిత్రులు శ్రీమతి చిందం సునీత, శ్రీమతి దాసరి శాంత కుమారి , శ్రీమతి కొలిపాక శోభారాణి , కుమారి చీకట్ల సంగీత లకు ప్రధానం చేశారు.

IMG-20190112-WA0582(కుమారి చీకట్ల సంగీత)

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు (కరీంనగర్) మాడిశెట్టి గోపాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా,

IMG-20190112-WA0705

అతిథులుగా ఎఆర్ డి ఎస్ పి ప్రతాప్, పెద్ది ఆనందం, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టీవి సూర్యం,సీనియర్ జర్నలిస్ట్, రోటరీ క్లబ్ లిటరసీ & WinS ఏరియా కమిటీ చైర్మెన్ సిరిసిల్ల శ్రీనివాస్,

IMG-20190112-WA0559

స్వాతంత్ర్య సమరయోధులు రాఘవేంద్రరావు,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బూసారపు శ్రీనివాస్ గౌడ్, ఎల్లాల రాజేందర్ రెడ్డి, గాజుల రాజేందర్, బండ శంకర్, డా. రాజగోపాలాచారి, అలిశెట్టి ఈశ్వరయ్య ఎల్ల గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

IMG-20190112-WA0598

అనంతరం పురస్కార గ్రహీతలు కవులు రచయితలు స్థానిక అలిశెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించి నివాళులు అర్పించారు.