ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

0
50

ఢిల్లీ : sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190107-WA0309

లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

వెయ్యి చ‌ద‌ర‌పు అడుగుల ఇంటిస్థ‌లం, ఐదెక‌రాల పొలం ఉన్న వాళ్లు ఈ రిజ‌ర్వేష‌న్లకు అన‌ర్హులు.

ఈ తాజా నిర్ణ‌యంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి.ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది.

రాజ్యాంగంలోని రెండు ఆర్టిక‌ల్స్‌(15, 16)కు స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంటుంది.

మోదీ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో త‌మ అగ్ర‌వ‌ర్ణాల ఓటు బ్యాంక్‌ను బీజేపీ మ‌రింత బ‌లోపేతం చేసుకున్న‌ట్ల‌యింది. మంగళవారమే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఈ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంది.