ఇసుక అక్ర‌మ ర‌వాణాపై ఉక్కుపాదం : జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి

0
52

రాజన్న సిరిసిల్ల జిల్లా: 07, జనవరి 2019 :


జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్‌   వెంకట్రామి రెడ్డి అన్నారు.

Venkata-Rama-Reddy-IAS-Mancherial

ఆదిశగా రెవిన్యూ , పోలీస్ , మైనింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేసారు .

అనుమతుల మేరకే ఇసుకను తరలించాలన్నారు. అనుమతులకు విరుద్ధంగా , అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు గుర్తిసే …. లారీ , ట్రాక్టర్ లను మూడు నెలల పాటు సీజ్ చేస్తామన్నారు.

భారీ జరిమానాల తో పాటు , వాహ‌నాల నంబ‌ర్ల‌ను బ్లాక్ చేస్తామన్నారు . ఇసుక అక్ర‌మ ర‌వాణా చేసే డ్రైవ‌ర్ల‌తోపాటు, వాహ‌న య‌జ‌మానుల‌పైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు .

ఇకనుంచి ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దాడులు మరింత ముమ్మరం చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద నిఘాను మరింత పెంచుతామన్నారు . ప్రతి వాహనం ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. నిబంధనల ప్రకారం ఉంటేనే వాటిని పంపిస్తామన్నారు .

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తున్నామన్నారు . ఎక్కడ పొరపాట్లు జరిగినా నిర్వాహకులే బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేసారు .

జిల్లాలో అక్రమ ఇసుకు డంపులు గుర్తిసే సంబంధిత గ్రామ రెవిన్యూ అధికారి , గ్రామ రెవిన్యూ సహాయకులపై సస్పెండ్ చేస్తామన్నారు.

సంబంధిత మండల తహసిల్దార్ కు షో కాజ్ నోటీసు లు జారీ చేస్తామనారు.
సహజ వనరుల దోపిడీ కి పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామ రెడ్డి హెచ్చరించారు .

దాడులు ముమ్మరం ….. 6 లారీలు సీజ్

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవిన్యూ , పోలీస్ , మైనింగ్ అధికారులు …. గడిచిన వారం రోజులుగా జిల్లాలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు .

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6 లారీలు సీజ్ చేసారు . ఇసుక తరలిస్తున్న ప్రతి వాహనం పై అధికారులు నిఘా పెడుతున్నారు . నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే సీజ్ చేస్తున్నారు .

ఇసుక తరలింపు అర్దరాత్రి జరిగే ఆస్కారం ఉన్న దృష్ట్యా ….. రాత్రి వేళల్లో తనిఖీ లను అధికారులు ముమ్మరం చేస్తున్నారు .