ఉపాధ్యాయా! ఎందుకు మీపై కక్ష…ముద్దు రామక్రిష్ణయ్య విగ్రహం ధ్వంసం

0
44

జగిత్యాల..sircilla srinivas, 9849162111,


జగిత్యాల ప్రాంతంలో ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ముద్దు రామక్రిష్ణయ్య విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు.

IMG20190113095255

వివరాల్లోకి వెళితే….జగిత్యాల ఓల్డ్ హైస్కూల్ అంటేనే ఎవరికైనా ముద్దు రామక్రిష్ణయ్య పేరు గుర్తుకొస్తుంది..

ఉపాధ్యాయ లోకానికే వన్నె తెచ్చిన ఆయన ఈ ప్రాంతంలో ఎంతో మంది ఆరాధ్య గురువు. ఆయన చదువు చెప్పిన విద్యార్థులెందరో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా వివిధ రంగాల్లో ఎదిగారు.

IMG20190113095305

ఈ నేపథ్యంలోనే ఆయనను నిత్యం స్మరించుకునే విధంగా స్వర్గీయ ముద్దు రామక్రిష్ణయ్య విగ్రహాన్ని, ఆయన పూర్వ విద్యార్థులు ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో 7-9-2010 సంవత్సరంలో అప్పటి మంత్రివర్యులు డి.శ్రీధర్ బాబు చేతులమీదుగా ఆవిష్కరణ గావించారు.

IMG20190113094530

అయితే కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్వర్గీయ ముద్దు రామక్రిష్ణయ్య విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.

PicsArt_01-13-10.56.20

చుట్టూ ఉన్న ఇనుప కంచెను విరగ్గొట్టారు. ఇది చూసిన హైస్కూల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విరిగిన ఇనుప కంచెను భద్రపరిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు బోనగిరి దేవయ్య, ఓల్డ్ హైస్కూల్ పూర్వ విద్యార్థి సిరిసిల్ల శ్రీనివాస్ లు ఆందోళన వ్యక్తం చేస్తూ, అందరికీ ఆదర్శప్రాయుడైన స్వర్గీయ ముద్దు రామక్రిష్ణయ్య విగ్రహాన్ని పునరుధ్దరించాలనీ, చుట్టూ కంచెను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని…విగ్రహం ధ్వంసం చేస్న వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.