ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌…

0
60

హైదరాబాద్‌ / కరీంనగర్, sircilla srinivas, 9849162111, telanganareporter.news

ఏకగ్రీవమైన వాళ్లకు ఈరోజే ధ్రువీకరణ పత్రాలు….

IMG-20190121-WA0366

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో  ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సోమవారమే ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.

IMG-20190121-WA0367

మొత్తం 4479 పంచాయతీలకు గానూ, 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

దీంతోపాటు 9 పంచాయతీలు, 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి.

అయితే, ఏకగ్రీవమైన పంచాయతీల్లోని అభ్యర్థులకు ఈ రోజు ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4గంటల తర్వాత ఫలితం వచ్చే అవకాశం ఉండగా, పెద్ద పంచాయతీల్లో రాత్రి 11గంటల వరకూ పట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

సారంగాపూర్ మండలం అర్పపల్లి లో మాత్రం అయిదుగురు పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రంలో కాకుండా, వేరే చోట రాత్రి బస చేశారని..పోటీ అభ్యర్ధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ అయిదుగురు సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించారు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 414 గ్రామ పంచాయతీలకు గాను 31 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగతా 383 గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వహించారు.

కరీంనగర్ జిల్లాలోని 97 పంచాయతీలకు గాను 4 ఏకగ్రీవం కాగా 93 పంచాతీలకు గాను 463 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.

సిరిసిల్ల జిల్లాలో 13 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా..67 గ్రామపంచాయతీల్లో 281 మంది బరిలో ఉన్నారు.

పెద్దపల్లి జిల్లాలో 4 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.102 పంచాయతీల్లో 477 మంది పోటీ పడ్డారు.

జగిత్యాల జిల్లాలో 10 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 121 గ్రామపంచాయతీల్లో 486 మంది పోటీ పడ్డారు.

జగిత్యాల జిల్లాలో 81.80% పోలింగ్ నమోదు..

జగిత్యాల జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 6 మండలాల్లో
పోలింగ్ ముగిసే వరకు
1,27,161 ఓట్లు పోలయ్యాయి.

 పోలింగ్ నమోదు శాతం:  81.80% 

మండలాల వారిగా పోలింగ్ నమోదు‌ శాతం:

బీర్ పూర్ మండలం :       82.93 %

బుగ్గారo మండలం :            80.17 %

ధర్మపురి మండలం :              79.47 %

రాయికల్ మండలం :    –        81.15 %

సారంగాపూర్ మండలం :   83.42 %

వెల్గటూరు మండలం:  –      83.69%