ఎస్సారెస్పీ ద్వారా కుంటలు , చెరువులు నింపాలి..ఎమ్మెల్యే గంగుల కమలాకర్

0
86

Hyderabad:

* నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలి..

IMG-20190105-WA0347

* కొత్తపల్లి చెరువును నింపేందుకు ఎస్సారెస్పీ నీటి ద్వారా నింపేందుకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలి…

* ఖాజీపూర్ చెరువు కింద ఉన్న ఆయకట్టు కు మిడ్ మానేరు ద్వారా నీరందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలి…

హైదరాబాద్ ఎస్సారెస్పీ, వరద కాల్వ అధికారుల సమీక్షా సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్…

వచ్చే ఖరీఫ్ పంటకు ఫిబ్రవరి మొదటి వారంలో ఎస్సారెస్పీ కాలువ నీటి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపింధించిందని ,ఎస్సారెస్పీ కాలువ ద్వారా నియోజకవర్గంలో ని ప్రతి గ్రామంలో ని చెరువులను కుంటలను నింపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని గంగుల కమలాకర్ అన్నారు…

నేడు హైదరాబాద్ లోని ENC కార్యాలయంలో వచ్చే ఖరీఫ్ పంటకు నీరు అందించేందుకు ఉన్న ఇబ్బందులపై ఎస్సారెస్పీ ,వరద కాలువ అధికారులు ,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే లతో ENC మురళీధర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు..

ఈ సమీక్ష సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వ కింద ఉన్న ఆయకట్టు తో పాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న చెరువులను కుంటలను ఎస్ ఆర్ ఎస్ నీటితో నింపాలని ఎం సి మురళీధర రావు గారికి విజ్ఞప్తి చేశారు…

కొత్త కొత్త పల్లి మండలం లోని ఊర చెరువు నింపేందుకు ఎస్సారెస్పీ కాలువ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసి చెరువులో పూర్తిస్థాయిలో నీరు నింపేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు…

ఖాజీపూర్ చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతుల భూములు ఎండిపోకుండా చూడాలని మిడ్ మానేరు ప్రాజెక్టు ద్వారా శాశ్వతంగా మీరు వచ్చేందుకు వీలుగా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టి నిర్మించాలని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు…

నియోజకవర్గంలోని ఇంచు భూమి ఎండకుండా కృషి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తామని గంగుల కమలాకర్ అన్నారు…

నియోజకవర్గంలోని వచ్చే ఖరీఫ్ నాటికి ఆయకట్టు రైతులు అందరికీ 3 పంటలకు నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు..

-ఆచంపల్లి వరదకాలువ వద్ద ఫీడర్ చానల్ పనులలో జాప్యం పై కూడా ఎమ్మెల్యే స్పందించారు…ఫీడర్ చానల్ కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆచంపల్లి వరద కాలువ వద్ద నిర్మాణంలో ఉన్న ఫీడర్ చానల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.. ఫీడర్ ఛానల్ ద్వారా నాగులమల్యాల, బద్దిపల్లి, కమాన్‌పూర్, బావుపేట, కొండాపూర్ గ్రా మాలకు తాగు, సాగునీరు అందుతుందన్నారు…. కాలువ నిర్మాణంలో బండరాళ్లు అడ్డు రావడంతో పనులు ఆలస్యంగా సాగుతున్నాయన్నాని అంచనా వ్యయం మార్చాలని అన్నారు..

. ఫిబ్రవరి మొదటి వారంలోగా కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ENC మురళీ ధర్ రావు గారికి విజ్ఞప్తి చేశారు…నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పై ENC మూరళీధర్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒక ప్రకటన లో తెలియ జేశారు…