ఓటు హక్కు వజ్రాయుధం…. కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి

0
143

logo ss ok

కరీంనగర్….sircilla srinivas..9849162111,


ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు.

IMG-20181111-WA0254

ప్రజలు ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

IMG-20181111-WA0248

ఆదివారం నాడు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో వివిధ విభాగాలకు చెందిన పోలీసులు, బిఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

IMG-20181111-WA0256

ఈ సందర్భంగా బొమ్మకల్ గ్రామంలో ఏర్పాటైన కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ…. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలను అడ్డుకోవద్దన్నారు.

IMG-20181111-WA0251

ప్రతి పౌరునికి స్వేచ్ఛ ఉందని, స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రభుత్వ కార్యాలయాలు,స్థలాల్లో వివిధ పార్టీల జెండాలను ఎగుర వేయకూడదని తెలిపారు.

IMG-20181111-WA0250

ప్రైవేటు స్థలాల్లో గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత యజమానుల అనుమతి తీసుకోవాలని కోరారు. అనుమతి లేకుండా గోడలపై రాతలు, బ్యానర్లు ఏర్పాటు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

IMG-20181111-WA0242

బైండోవర్ అయిన వ్యక్తులు మళ్లీ ఏదైనా నేరానికి పాల్పడినట్లయితే ఒక లక్ష రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది అని తెలిపారు. ఓట్ల కోసం ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలుపాలని కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు చేస్తున్న కృషికి అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

ప్రచారాల కోసం డీజే లను వినియోగించడం నిషేధించడం జరిగిందని చెప్పారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సీఐ శశిధర్ రెడ్డి, కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాస రావు, ఆర్ఐ కిరణ్ కుమార్, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.