ఓదార్చే మాటల కన్నా… సాయం చేసే చేతులే మిన్న…అన్నట్లుగా, అదే స్పూర్తితో ముందుకు సాగుతున్న…… శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి

0
70

IMG_20181228_225709

Jagtial, Sircilla Srinivas, 9849162111, telanganareporter.news


సామాజిక సేవా కార్యక్రమాలలో..ఓదార్చే మాటల కన్నా,  సాయం చేసే చేతులే మిన్న…అన్నట్లుగా, అదే స్పూర్తితో..జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి జిల్లా స్థాయిలో ఉన్నతమైన సేవలను అందిస్తూ…పలువురికి ఆపన్న హస్తం అందిస్తుంది.

IMG-20190111-WA0555

మానవ సేవే, మాధవ సేవగా.. జగిత్యాలకు చెందిన కొందరు యువకులు ప్రతి నిత్యం వివిధ వ్యాపారాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ… సమాజ సేవచేయడానికి తొలుత 20 మంది యువకులు కలిసి, జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్చంద సేవాసంస్థ ను 2011లో స్థాపించారు.

IMG-20190111-WA0556

విరామ సమయంలో కూడా సేవాదృక్పధంతో ఒక సంస్థ గా ఏర్పడి గత ఏడు సంవ్సత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ… అందరి మన్నలను పొందుతున్నారు.

IMG-20190111-WA0554

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలలోని ఆడబిడ్డల వివాహం కు, ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు, సొంత ఇల్లు లేకుండా మరణించిన పేద కుటుంబాలకు దహన సంస్కారాలకు ఇతోధికంగా, ఇప్పటి వరకు సుమారుగా 12 లక్షల రూపాయలను ఆర్థిక సహయం రూపంలో సేవా కార్యక్రమాలకు అందిస్తూ నిస్వార్థ సేవకు నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు.

అంతే కాకుండా వివేకానందుని జన్మదిన సందర్బంగా ప్రతి సంవ్సత్సరం స్థానిక సబ్ జైలు లో పండ్ల పంపిణీ, నవోదయ ప్రవేశ పరీక్షా విద్యార్థులకు టానిక్ ట్యుటోరియల్ ద్వారా 20 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు.

వివిధ రంగాలలో పని చేస్తూ ప్రభుత్వ నుండి సేవా పథకం పొందిన ఉద్యోగులను, వైద్యులను, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలలో సేవలను అందిస్తున్న సేవా బంధువులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సహిస్తున్నారు.

ఇట్టి కార్యక్రమాలలో కలిసివచ్చిన వారిని కలుపుకుంటూ సామాజిక కార్యక్రమాలను చేస్తున్న వారిని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు యల్ రమణ, జాయింట్ కలెక్టర్ పలు కార్యక్రమాలలో పాల్గొని, ప్రశంసించారు.

ఇటీవలి కాలంలో భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల నిరుపేద యువతుల వివాహ కానుకగా ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్ రాజేశం , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతులమీదుగా ఆర్థిక సహాయం సమితి ద్వారా ఆర్ధిక సహాయం అందజేశారు .

శుక్రవారం రోజున స్థానిక సబ్ జైల్లో ఖైదీలకు పండ్ల పంపిణీ మరియు జిల్లా ఆస్పత్రిలో పండ్లు ,బ్రెడ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్వచ్చంద సేవా సమితి కార్యనిర్వాహక సభ్యులు ఆకుబత్తిని శ్రీనివాస్ , చిలుకమారి శ్రీనివాస్ , భీమనాతిని భూమేశ్వర్ , అనుమల్ల శ్రీనివాస్ , సబ్ జైలర్ శ్రీనివాస్ రెడ్డి, ఎలిగేటి లింబద్రి, మ్యాన మహేష్ , మోర హనుమడ్లు, కొక్కుల సుదర్శన్, మానపురి శ్రీనివాస్, నందగిరి ప్రసాద్ , గుండేటి గంగాధర్, జోగ మల్లేశం, నందగిరి రవి తదితరులు పాల్గొన్నారు..

అభినందనలు :

196
సేవా సమితి సభ్యులకు ఈ సందర్భంలో సీనియర్ జర్నలిస్ట్, “తెలంగాణ రిపోర్టర్” CEO, రోటరీ క్లబ్ Literacy & WinS ఏరియా కమిటీ చైర్మెన్ సిరిసిల్ల శ్రీనివాస్  అభినందనలు తెలియజేశారు.