కరీంనగర్ జిల్లాకు మరో జాతీయ స్థాయి అవార్డు….బేటీ బచావో- బేటీ పడావో పథకం జిల్లాలో విజయవంతం…కలెక్టర్‌కు అవార్డు

0
93

IMG_20181228_225709

కరీంనగర్ : sircilla srinivas, 9849162111


collector sarfaraj ahmed

  • ఈ నెల 24న ఢిల్లీలోని  ప్రవాసీ భారతీయ కేంద్రంలో ఈ అవార్డును అందుకోబోతున్న  కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

krmr

కరీంనగర్ జిల్లాకు మరో జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో- బేటీ పడావో పథకాన్ని జిల్లాలో విజయవంతంగా, స్ఫూర్తిదాయకంగా అమలు చేస్తున్నందుకు ఎఫెక్టివ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు.

ఈ అవార్డును అందుకుంటున్న దేశంలోని 24 జిల్లాల్లో మన జిల్లా ఉంది. ఇప్పటికే పలు అవార్డులు అందుకుని జాతీయ స్థాయిలో గుర్తుంపు తెచ్చిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ నెల 24న మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగే జాతీయ బాలికల దినోత్సవంలో ఈ అవార్డును అందుకోబోతున్నారు.

రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పోటీ పడిన కరీంనగర్ జిల్లాకు ఈ అవార్డు వచ్చినందుకు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను అభినందిస్తూ ఆహ్వానం పలికారు. బేటీ బచావో- బేటీ పడావో పథకం జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్‌కు అవార్డు రావడం పట్ల పలు శాఖల అధికారులు హర్షం వ్యక్తం చేశారు.