కుంభమేళాకు వచ్చే భక్తులపై హెలికాప్టర్ నుంచి పుష్ఫవర్షం – సీఎం యోగి ఆదిత్యనాథ్

0
48

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 15 నుంచి నిర్వహించబోయే కుంభమేళాకు వచ్చే భక్తులపై హెలికాప్టర్ నుంచి పుష్ఫవర్షం కురిపించనున్నారు.

up cm yogi adityanath
(UP CM Yogi Adityanath)

ఇందుకుగాను యోగి ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగ్‌రాజ్‌లో కుంభమేళాకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎం యోగి విలేకరులతో మాట్లాడారు. కుంభమేళాలో పుణ్యస్నానాలు నిర్వహించే ప్రత్యేక తేదీలలో భక్తులపై పుష్ఫ వర్షం కురిపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

జనవరి 17న రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఫిబ్రవరిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుంభమేళాకు రానునున్నారని తెలిపారు. ఫిబ్రవరి 22 న పలు దేశాల ప్రతినిధులు కుంభమేళాలో పాల్గొననున్నారన్నారు.