కొత్తగా 25 మంది సభ్యులు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు.

0
49

హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా ఇవాళ కొలువుదీరింది. ఈ క్రమంలో 119 మంది సభ్యులకు గానూ 114 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.

assembly

అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకటవీరయ్య, రాజా సింగ్ సభకు హాజరు కాలేదు. ఇక కొత్తగా 25 మంది సభ్యులు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు.

టీఆర్ఎస్ సభ్యులు :
బొల్లం మల్లయ్య యాదవ్(కోదాడ), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల), సుంకే రవిశంకర్(చొప్పదండి), పట్నం నరేందర్ రెడ్డి(కొడంగల్), బాల్క సుమన్(చెన్నూరు), క్రాంతికిరణ్(అందోల్), ముఠా గోపాల్(ముషీరాబాద్), కాలేరు వెంకటేశ్(అంబర్‌పేట), బేతి సుభాశ్ రెడ్డి(ఉప్పల్), సీహెచ్ మల్లారెడ్డి(మేడ్చల్), మెతుకు ఆనంద్(వికారాబాద్), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(వనపర్తి), నన్నపనేని నరేందర్(వరంగల్ తూర్పు), సంజయ్ కుమార్(జగిత్యాల), కొప్పుల మహేశ్ రెడ్డి(పరిగి), కంచర్ల భూపాల్ రెడ్డి(నల్లగొండ)

కాంగ్రెస్ సభ్యులు :
పైలెట్ రోహిత్ రెడ్డి(తాండూరు), బానోతు హరిప్రియ నాయక్(ఇల్లందు), కే ఉపేందర్ రెడ్డి(పాలేరు), హర్షవర్ధన్ రెడ్డి(కొల్లాపూర్), సురేందర్(ఎల్లారెడ్డి), ఎం నాగేశ్వర్ రావు(అశ్వారావుపేట), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(మునుగోడు)

స్వతంత్ర అభ్యర్థులు :
కోరుకంటి చందర్(రామగుండం), రాములు నాయక్(వైరా)