కొన్ని మీడియా సంస్థలు నిజనిజాలు తెలుసుకోకుండా, కామన్ సెన్స్ లేకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం

0
68

హైదరాబాద్ :

కొన్ని మీడియా సంస్థలు కామన్ సెన్స్ లేకుండా, నిజనిజాలు తెలుసుకోకుండా వార్తలను పబ్లిష్ చేస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడం పట్ల సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం, ప్రధాని కావాలనే లక్ష్యంతోనే నేటి నుంచి ఐదు రోజుల పాటు సహస్ర చండీ మహాయాగం చేస్తున్నారని ఓ ఇంగ్లీష్ మీడియా వార్త ప్రచురించింది. ఈ వార్తను హర్షవర్ధన్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేస్తూ.. కేసీఆర్ ప్రధాని కోసం యాగాలు చేయడం లేదని.. ఇలాంటి వార్తలు నిరాధారం అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ సంబంధిత ఇంగ్లీష్ మీడియాకు ఘాటుగా సమాధానం ఇచ్చారు.