క్షయవ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

0
57

జగిత్యాల, sircilla srinivas, 9849162111


జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. శ్రీధర్  అధ్యక్షతన జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్  ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సమావేశంలో పరీక్ష కేంద్రంను సందర్శించారు.

IMG_20190112_232848

ఈ సందర్భంగా టీబీ వ్యాధిగ్రస్తులకు జరుగుతున్న చికిత్స గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాల కింద వారికి అందుతున్న పారితోషికాలగురించి వివరించారు .
నీ క్షయ పోషణ యోజన :
అనే ప్రోగ్రాం ద్వారా క్షయవ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలము నెలకు 500 రూపాయలు ఇవ్వడంతో జరుగుతుందాని .ఈ ప్రభుత్వ పథకం కింద మన జగిత్యాల జిల్లాలో 783 వ్యాధిగ్రస్తులకు వాళ్లు వివిధ చికిత్సలకి సుమారు 12 లక్షల 50 వేల రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని  క్షయ వ్యాధిగ్రస్తులు గవర్నమెంటు , ప్రైవేట్ వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరారు.
సి బి నాట్ :
ఈ పరీక్ష కేంద్రము మన జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రూమ్ లో ప్రారంభించామని ఈ మిషన్ కాస్ట్ సుమారు 30 లక్షలు ఈ మిషన్ ద్వారా ఎటువంటి ఏ వ్యాధి అయినా నిర్ధారించడం జరుగుతుందని గత డిసెంబర్ నెలలో 350 పరీక్షలు చేయడం జరిగిందని అనుమానితులు అందరూ అవకాశాన్ని వినియోగించుకోవలని కోరారు.
గెజిట్ నోటిఫికేషన్ : భారత ప్రభుత్వ గెజిట్ 2016 ప్రకారము  ప్రతి ప్రైవేట్ డాక్టర్ , ఫార్మసిస్టులు , డ్రగ్గిస్ట్ మెడికల్ షాప్ యజమానులు విధిగా వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు ప్రభుత్వానికి అందజేయాలని చట్ట ప్రకారం శిక్ష జరిమానా విధించడం జరుగుతుందని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వివరాలు సమర్పించ వలసిందిగా డాక్టర్ ఎన్ శ్రీనివాస్ కోరారు.