ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమంది అయ్యప్ప భక్తులు మృతి..

0
50

పుదుకొట్టై , తమిళనాడు :

IMG-20190106-WA0392

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.

మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.         ఈ ఘటన పుదుకొట్టై సమీపంలో జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది భక్తులతో వ్యాన్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది.

భక్తులతో వెళుతున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దాంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా తెలంగాణకు చెందిన వారుగా తెలుస్తోంది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.

మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన పుదుకొట్టై సమీపంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 16 మంది భక్తులు వ్యాన్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది.

భక్తులతో వెళుతున్న ఈ వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. దాంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా తెలంగాణకు చెందిన వారుగా తెలుస్తోంది.

మృతులు మెదక్‌ జిల్లా నర్సాపురం మండలానికి చెందిన కుమార్‌, ప్రవీణ్‌, కృష్ణసాయి, ఆంజనేయులు, నాగరాజు, మహేష్‌, శ్యామ్‌, సురేష్‌ ఉన్నారు.

వీరితో పాటు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.