చైనా రాకెట్ చంద్రునిపై కాలుమోపింది….

0
74

చైనా రాకెట్ చంద్రునిపై కాలుమోపింది. అదీ మనకు కనిపించని వైపు. అన్వేషక నౌక చాంగే-4 గురువారం ఉదయం 0.30 గంటలకు చంద్రునిపై దిగింది.

change-4-rover

చైనా సెంట్రల్ టెలివిజన్ ఈ వార్తను మధ్యాహ్నం బులెటిన్‌లో హెడ్‌లైన్స్‌లో వెల్లడించింది. చంద్రుని మరోవైపు భూమి మీద నుంచి కనిపించదు. పైగా చీకటిగా ఉంటుంది. అందుకే దానిని డార్క్‌సైడ్ ఆఫ్ మూన్ లేదా చంద్రుని చీకటి పార్శం అని పిలుస్తారు.

చాంగే-4 సాధించిన ఈ విజయం చైనా అంతరిక్ష ఆఆకంక్షలకు అద్దం పడుతున్నది. సోవియట్ యూనియన్ 1976 లో లూనాను చంద్రుని మీదకు పంపింది. ఆ తర్వాత 2013లో చంద్రునిపై వాలిన మొదటి అంతరిక్షనౌక చాంగే-3 చైనా ప్రయోగించిందే. ఇప్పుడు చంద్రుని మరోవైపు అన్వేషక నౌకను పంపి చైనా రికార్డు సృష్టించింది.

చాంగే-4 అనేది ఓ రోవర్. అది రేడియో కిరణాలపై, ఖనిజాలపై పరిశోధన జరుపుతుంది. ఈ నౌక పంపే సంకేతాలను భూమికి చేరవేసేందుకు గత మే నెలలో చైనా క్యూకియావ్ లేదా మ్యాగ్‌పై బ్రిజ్ అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. వచ్చే ఏడాది చాంగే-5 అనే అన్వేషక నౌకను చంద్రుని మీదకు పంపాలని ఐచనా భావిస్తున్నది.

ఆ నౌక కొన్ని నమూనాలతో భూమికి తిరిగివస్తుందని అంచనా. 1976లో చివరిసారిగా ఈ తరహా లక్ష్యంతో సోవియట్ యూనియన్ లూనాను పంపింది. ఇప్పుడు చైనా మరోసారి నమూనాల సేకరణకు అంతరిక్ష అన్వేషణా నౌకను పంపాలని చూస్తున్నది.