జగిత్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయులు బుర్ర బాల గంగాధర్ (62) మృతి

0
51

జగిత్యాల జిల్లా : జనవరి 5: telanganareporter.news

IMG-20190105-WA0394

జగిత్యాలకు చెందిన సీనియర్ పాత్రికేయులు బుర్ర బాల గంగాధర్ (62) శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

IMG_20190105_174721

బాల గంగాధర్ మృతి పట్ల రాష్ట్ర బిసి కమిషన్ చైర్మెన్, బి ఎస్. రాములు, రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మెన్ జి.రాజేశం గౌడ్, టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, టివి9 అధినేత రవిప్రకాష్, నేటి నిజం దేవదాస్, సీనియర్ జర్నలిస్టులు సిహెచ్ వి.ప్రభాకర్ రావు, సిరిసిల్ల శ్రీనివాస్, జె.సురేందర్ కుమార్, పిఎస్ రంగారావు, టివి సూర్యం, కె.శ్రీనివాస్, కె.మహేశ్, రాజేందర్ రెడ్డి, ఎస్.రామకిష్టయ్య, ఎస్. రాజేంద్రశర్మ, సామాజిక రచయితలు ఎంవి.నరసింహారెడ్డి, వేముల ప్రభాకర్, బి. నర్సన్, సామ్రాట్ అశోక్, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాలగంగాధర్ మృతి తీరని లోటు

IMG-20190105-WA0393

1982 లో జగిత్యాలలో చాటింపు దినపత్రిక ను ప్రారంభించి, సంవత్సర కాలంపాటు నిరాటంకంగా నడిపిన అనంతరం హైదరాబాద్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

తన పత్రిక ద్వారా నిస్వార్థంగా ప్రజోపయోగమైన వార్తా కథనాలు రాసి, మంచి పేరు తెచ్చుకున్న బాలగంగాధర్ మృతి తీరని లోటు అని జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో పలువురు పాత్రికేయులు అన్నారు.

బాల గంగాధర్ చిత్రపటానికి పూలమాల వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం వ్యక్తం చేశారు…

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సిహెచ్ వి.ప్రభాకర్ రావు, సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం,ఎండి.ఇమ్రాన్, కుర్మాచలం శ్రీనివాస్, కొత్తూరి మహేశ్, మరియు రాజేందర్ రెడ్డి, శశిధర్, సంపూర్ణచారి,  సిరిసిల్ల రాజేంద్రశర్మ, గుండేటి రాజు, శెలేందర్ రెడ్డి, మారుతి,హరికృష్ణ, దుర్గా శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు హరి అశోక్ కుమార్, అలిశెట్టి ఈశ్వరయ్య, విశ్వనాథం తదితరులు పాల్గొని నివాళులర్పించారు.