జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో…. ఈ – చలాను విధానాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్

0
161
IMG_20181209_183521_0

jagtial dist. sircilla srinivas 9849162111


https://youtu.be/YQx1Dj02JWM
ప్రజలకు ఈ-చాలాన్ అంశంలో పోలీసు శాఖ  అవగాహన కల్పించాలని ….ట్రాఫిక్ పోలీసుల పనితీరును మెరుగుపరుస్తూ….తద్వారా ప్రయాణీకుల భద్రతయే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ-చాలాన్ విధానం సత్ఫలితాలిస్తుందని, జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్ అన్నారు.
IMG-20190111-WA0387
జగిత్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ – చాలాను విధానాన్ని జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్ ప్రారంభించారు.
IMG_20190111_143421
స్థానిక ఐఎంఏ హాల్లో జిల్లా ఎస్ పి శ్రీమతి సింధుశర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ శరత్, ఎస్‌ పి సింధుశర్మతో పాటుగా ఆర్డీఓ డా.జి.నరేందర్, అడిషనల్ ఎస్‌ పి మురళీధర్, జిల్లా అటవీశాఖ అధికారి నరసింహారావు, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు, డిఎస్పీలు వెంకటరమణ, మల్లారెడ్డి, సిఐలు ప్రకాష్, రాజేష్, లక్ష్మిబాబు, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
IMG_20190111_155522
 

ఈ-చలాన్ విధానాన్ని ప్రారంభించిన అనంతరం, జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, గతంలో ఉన్న విధానానికి భిన్నంగా, రోజు రోజుకూ మారుతున్న ఆధునిక పద్దతులకనుగుణంగా ప్రజల, ప్రయాణీకుల భద్రతకోసం రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ఈ-చాలాన్ విధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు ముందుగా  అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

IMG_20190111_155550
జిల్లా ఎస్ పి శ్రీమతి సింధుశర్మ మాట్లాడుతూ, పోలీసు లకు-ప్రజలకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా, పారదర్శకంగా ఉండాలన్న ధ్యేయంతోనే   తెలంగాణ  పోలీసు శాఖ ఈ-చాలాన్ విధానం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే, జగిత్యాల జిల్లా లో శుక్రవారం నుంచి ఈ-చాలాన్ విధానంను ప్రారంభించడం జరిగిందన్నారు.
IMG_20190111_143437
ఈ విధానంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదని ఈ-చాలాన్ విధానంలో  ట్రాఫిక్ రూల్స్, వీటిలో పొందుపరచిన 145 అంశాలున్నాయనీ, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
IMG_20190111_155534
ఇందుకుగాను రక్షణ తో కూడిన ప్రయాణం చేయడానికిగాను ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఈ సందర్భంగా ఎస్‌ పి సింధుశర్మ ప్రజలను కోరారు.