జనవరి 17, 2019న తెలంగాణ నూతన శాసనసభ కార్యకలాపాలు…

0
97

Hyderabad, sircilla srinivas, 9849162111,


196

జనవరి 17, 2019న తెలంగాణ నూతన శాసనసభ కార్యకలాపాలు ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతాయి.

 

IMG_20181211_152847

శాసనసభ సమావేశాలు జనవరి 20 వరకు కొనసాగుతాయి.

కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల్లో సీనియర్ అయిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ని జనవరి 16న సాయంత్రం 5 గంటలకు, రాజ్ భవన్ లో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

కొత్తగా ఎన్నికైన ఇతర శాసనసభ సభ్యులు    17 జనవరి నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ మధ్యాహ్నం జూబ్లీహాల్ ప్రాంగణంలో శాసనసభ సభ్యులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు.

అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ల స్వీకారం వుంటాయి.

జనవరి 18న నూతన సభాధ్యక్షుడి అధ్యక్షతన సభాకార్యక్రమాలు, స్పీకర్ ఎన్నిక వుంటుంది. ఆ తర్వాత బీఎసీ సమావేశం జరుగుతుంది.

జనవరి 19న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.

జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలుపుతుంది.