జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చంద్రశేఖర్..

0
43

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-

IMG-20190110-WA0420

రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిరిసిల్ల జిల్లా వైద్యాధికారిగా డాక్టర్  చంద్రశేఖర్ బుధవారం రోజున పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించారు.

IMG-20190110-WA0417

గతంలో జిల్లా వైద్య అధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ మారుతి రావు ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు క్లస్టర్ ఆసుపత్రి ఆర్ ఎం ఓ గా బదిలీ పై వెళ్లారు..

 

నూతన బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టిన మరుసటిరోజు ఎల్లారెడ్డిపేట్ ,గంభీరావు పెట్ క్లస్టర్,ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ ను వైద్య సిబ్బంది శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు…