తల్లిదండ్రులు లేని నిరుపేద వివాహానికి మంత్రి దంపతుల ఆర్థిక సాయం

0
44

*జగిత్యాల:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలోని మరియు తల్లిదండ్రులు లేని యువతి సింగరి భూలక్మి వివాహం కు గురువారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఎల్ ఎం కొప్పుల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25 వేల రూపాయల ఆర్థికసాయం చేసి, వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

నిరుపేద కుటుంబ్లకు చెందిన యువతుల వివాహమునకు సాయపడడం తమ అదృష్టమని, ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

తనకు సాయం చేసి, ఒక పెళ్లి పెద్దలుగా ఆర్థికంగా సాయం చేసినందుకుగాను నూతన వధూవరులు మంత్రి దంపతులకు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభకార్యానికి వారితో పాటుగా బుగ్గారం జడ్పీటిసి బాదినేని రాజేందర్, గ్రామ ఎంపిటిసి  గాలిపెల్లి మహేష్ , బుగ్గారం ఎంపిటిసి సుచింధర్ , టిఆర్ఎస్ అధ్యక్షులు మల్లేష్, రాచమడుగు సతీష్ రావు, టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు  తరాల వెంకటవ్వ, అమ్మాయి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here