తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవ0…సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

0
54

హైదరాబాద్ :

pocharam

తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు.

TS SPEAKER

పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ చైర్‌లో కూర్చోవాలని ప్రొటెం స్పీకర్ కోరారు. నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రొటెం స్పీకర్ అభినందనలు తెలిపారు.

అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డిని స్పీకర్ చైర్ వద్దకు సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకెళ్లి చైర్‌లో కూర్చోబెట్టారు. దీంతో స్పీకర్ గా పోచారం బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతరులు శుభాకాంక్షలు తెలిపారు.