పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి…..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి

0
60

ధర్మపురి 12 జనవరి 2019, తెలంగాణ రిపోర్టర్ , డా. మధు మహదేవ్ శర్మ


 

IMG-20190112-WA0800

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల నియమావళిని అధికారులు తప్పనిసరిగా అమలు పరచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు.

శనివారం ధర్మపురి మండల కేంద్రంలోని న్యూ టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఒకటవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల పివో మరియు ఏపీవో అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ధర్మపురి మరియు బుగ్గారం మండల అధికారులతో నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటిదని ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

శిక్షణ తరగతుల సందర్భంగా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేయడం సీల్ చేయడంతో పాటు ,వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలు గణన మొదలు ఉప సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ అభ్యర్థి డిక్లరేషన్ వరకు గల పలు స్థాయిల్లో వచ్చే సమస్యలు వాటికి సంబంధించిన పరిష్కారాలను సూచించడంతో పాటు అధికారులకు పలు కీలక అంశాలపై సూచనలు అందించారు.ధర్మపురి మరియు బుగ్గారం మండల టి ఓ ఏ పి ఓ స్థాయి అధికారుల ఎన్నికల శిక్షణ నైపుణ్యాలు బాగున్నాయని జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ను అభినందించారు.

అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు పరుస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ ఫేస్ వన్ , ఫేస్ టు స్థాయి లో శిక్షణ తరగతులు పూర్తి చేశామన్నారు .ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల ముందు కూడా ఎన్నికల సామాగ్రి వితరణ కేంద్రంలో సైతం మరల అధికారులకు సూచనలు సలహాలు ఇస్తామని వాటిని అధికారులు అందరూ పాటించాలని సూచించారు.

ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం కోసం జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, జగిత్యాల డి.ఎస్.పి వెంకటరమణ, జగిత్యాల ఆర్ డి ఓ,ధర్మపురి మండలం ఎంపీడీవో మరియు ధర్మపురి మరియు బుగ్గారం మండల ఎన్నికల పి ఓ ఏ పి ఓ అధికారులు పాల్గొన్నారు