పట్టణ అభివృద్ధి లో వైశ్య, వ్యాపార వర్గాల పాత్ర కీలకం….ఎమ్మెల్యే సంజయ్ కుమార్

0
67

IMG_20181228_225709

జగిత్యాల : sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190116-WA0184

జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణ అభివృద్ధిలో వైశ్య, వ్యాపార వర్గాల వారి పాత్ర కీలకమని, పట్టణ అభివృద్ధి కోసం తన వంతుగా రాజకీయాలకతీతంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.ఎం.సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

IMG-20190116-WA0186

బుధవారం జిల్లా కేంద్రం లో పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో…వైశ్యభవన్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు ఆత్మీయ సన్మానంను ఘనంగా నిర్వహించారు..

IMG-20190116-WA0188

ఈ సందర్బంగా శ్రీ వాసవిమాత ఆలయం అర్చకులు, ఆర్యవైశ్యులు, ఆలయం లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు స్వాగతం పలికారు.

IMG-20190116-WA0185

ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం..ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు స్వీట్స్ తో కూడిన బాక్సులతో తులాభారం నిర్వహించారు.

IMG-20190116-WA0189

పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు చకిణం కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైశ్య సంఘం అధ్యక్షులు పుల్లూరి సత్యనారాయణ, పట్టణ వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పెండ్యాల చెన్నకేశవ్, కోశాధికారి పెద్ది శ్రీకాంత్, గంప ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ జి.ఆర్. దేశాయి, మంచాల కృష్ణ, రాచకొండ నరేందర్, జిల్లా గంగాధర్ , వూటూరి ప్రభాకర్, కోటగిరి రవీందర్ తో పాటుగా పలువురు వైశ్య ప్రముఖులు,పట్టణంలోని పలు వీధుల వైశ్య సంఘాల నాయకులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ…వైశ్య వ్యాపార వర్గాల అభివృద్ధియే ధ్యేయంగా సహకరిస్తానని, పట్టణ అభివృద్ధి లో వైశ్య, వ్యాపార వర్గాల పాత్ర కీలకమన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, పట్టణాభివృధ్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు.పట్టణ విస్తరణలో లేఅవుట్ తో కూడిన ఒక్క కాలనీ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.

రోడ్ల విస్తరణ అంశంలో అవసరమైన రూ.3.5 కోట్లు సిధ్దంగా ఉన్నాయనీ, న్యాపరమైన చిక్కులను అధిగమించడానికి కృషి చేస్తానన్నారు.

ముందుగా ప్రధాన చర్చనీయాంశమైన  యావర్ రోడ్ లో ఉన్న ప్రభుత్వ స్థలాలను సెట్ బ్యాక్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామనీ, అభివృద్ధి అనేది ఒక్క రోజులో జరిగేది కాదనీ, పట్టణం అభివృద్ధి చెందడానికి అన్నివర్గాల ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కోరారు.

అలాగే, వైశ్యభవన్ నిర్మాణంకు సంబంధించిన నిధులు రూ.75 లక్షల విడుదలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నానన్నారు.
వైశ్యభవన్ నిర్మాణంకై ఎంపి కవిత సహకారంతో త్వరలోనే శంఖుస్థాపన కార్యక్రమం చేపడతానని వెల్లడించారు.కాగా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనకు జగిత్యాల ప్రజలు ఇచ్చిన ఓట్ల మెజారిటీని తిరిగి అందించాలని…ఇందుకుగాను వైశ్య,వ్యాపార వర్గాలవారు సహకరించాలని సంజయ్ కుమార్ కోరారు.

సమావేశం అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను వైశ్య సంఘం తో పాటుగా పలువురు వైశ్య, వ్యాపార వర్గాలవారు ఎమ్మెల్యే డా.ఎం.సంజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.