పార్కింగ్ ఫీ పేరిట వాహనదారుల నుండి డబ్బులు వసూలు చూస్తే సహించేది లేదు…కరీంనగర్ పోలీసు కమిషనర్, కమలాసన్ రెడ్డి

0
61

కరీంనగర్ 

సెలవులు, వారాంతపు సెలవులు, పండుగలు ప్రతీ సందర్భంలో మద్య తరగతి వారు కుటుంబ సమేతంగా వీక్షించే ఏకైక వినోదం సినిమా.

IMG-20180814-WA0554-1024x683

కరీంనగర్ లాంటి చిన్న నగరంలో ఉన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ ల యాజమాన్యం ప్రేక్షకుల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని తమ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల వద్ద టికెట్ రుసుము పోను పార్కింగ్ ఫీ పేరిట ద్విచక్ర వాహనాల కు రూ. 20/-, కారు లాంటి వాహనాల కు రూ. 30/- వసూలు చేస్తూ ప్రేక్షకుల జేబులు ఖాళీ చేస్తున్న విషయాన్ని ధృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం పార్కింగ్ ఫీ వసూలు చేయరాదని స్పష్టంగా ఆదేశిస్తూ జి.ఓ. జారీ చేసినారు.

అయినా థియేటర్ యజమానులలో ఎలాంటి మార్పు లేకుండా , జి.ఓ. ను పక్కన పెట్టి ఎప్పటిలానే ప్రేక్షకులనుండి పార్కింగ్ ఫీ వసూలు చేస్తున్న విషయం దృష్టికి వచ్చింది.

అందుకే తేదీ 09-01-19 రోజున కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కరీంనగర్, హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో ని థియేటర్, మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి  సమావేశం నిర్వహించారు…

ఇకముందు ప్రేక్షకుల వద్ద నుండి పార్కింగ్ ఫీ ఏ ఒక్క వాహనం నుండి వసూలు చేసినట్టు దృష్టికి వచ్చిన, క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని  పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.

ఈ ఆదేశాలు  బుధవారం (9-1-2019) నుండే పాటించవలసిందిగా ఆయన కోరారు.

అంతే కాకుండా వినోదం కోసం థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు కూడా వారి వద్ద ఎవరైనా పార్కింగ్ ఫీ పేరిట డబ్బులు వసూలు చేస్తే పోలీస్ దృష్టికి తీసుక రావలసిందిగా పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి
కోరారు.