పోగొట్టుకున్న సొత్తును అప్పగించిన కరీంనగర్ సీసీఎస్ పోలీసులు..

0
98

IMG_20181209_183521_0

Karimnagar, sircilla srinivas, 9849162111


~పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అప్పగింత…
~ఆనందంతో కృతజ్ఞతలు తెలిపిన వృద్ధదంపతులు..
~ ఇలాంటి పనులే పోలీసుల పట్ల నమ్మకం,ఉద్యోగ సంతృప్తినిస్తాయి… సిపి వి.బి.కమలాసన్ రెడ్డి

IMG-20190111-WA0402

కరీంనగర్ పట్టణంలోని జ్యోతినగర్ లో ఉంటున్న మామిడాల కిష్టయ్య దంపతులు గత సంవత్సరం మార్చి 28 న సిరిసిల్ల లో ఉంటున్న తన కొడుకు దగ్గరికి వెళ్లి,  తిరిగి రాత్రి  9 గం ల ప్రాంతంలో కరీంనగర్ లోని గీత భవన్ వద్ద బస్ దిగి, ఆటోలో భార్యాభర్తలు ఇద్దరు జ్యోతి నగర్ లోని తమ ఇంటి వద్ద దిగి ఇంట్లోకి వెళ్లారు.

అయితే,  అదే ఆటోలో దాదాపు 1,50,000/- విలువ గల 5 తులాల బంగారం, రెండు మొబైల్ ఫోన్స్, అతని ఆరోగ్య చికిత్స కోసం తెచ్చుకున్న మెషిన్ అందులో మర్చిపోయారు…

అప్పటి నుండి ఎంత వెతికిన దొరకగ పోగా, బాధతో చివరికి కరీంనగర్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ మధ్య కరీంనగర్ కమిషనరేట్ నందు  కమిషనర్ చే ప్రారంభించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానముతో పాటు సిసి కెమెరాలను ఉపయోగించి, ఎంతగానో శ్రమించి, సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు పోగొట్టుకున్న సొత్తును స్వాధీనం చేసుకుని, బాధితులకు శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది…

FB_IMG_1547209457438

ఇలాంటి పనులే పోలీసుల పట్ల నమ్మకం,ఉద్యోగ సంతృప్తినిస్తాయి…సిపి వి.బి.కమలాసన్ రెడ్డి

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి పనుల వల్ల ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం, నమ్మకం పెరుగుతుందని, అలాగే పోలీసులకు ఉద్యోగ సంతృప్తి లభిస్తుందని తెల్పుతూ, సీసీఎస్ పోలీసులను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది…

IMG-20190111-WA0401

పోలీసులకు కృతజ్ఞతలు…బాధిత వృద్ధ దంపతులు..

బంగారం,డబ్బులు మొత్తం పోయినై అనుకున్నం….కష్టపడ్డ సొమ్ము మల్ల దొరుకుతై అనుకోలే….చాలా రోజులైంది… ఐనా కూడా పోలీసులు వదిలిపెట్టకుండా దొరకపట్టి ఇచ్చిండ్లు….నాకు సరిగా కండ్లు కూడా కనపడై….దొరికేదాక ఎంటపడ్డారు….పోలీసులకు చాలా కృతజ్ఞతలు అంటూ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు...

ఈ కార్యక్రమంలో సిసీఎస్ ఏసీపీ శ్రీనివాస్,ఇన్స్పెక్టర్ కిరణ్,ఏఎస్సై వీరయ్య,కానిస్టేబుళ్లు సురేందర్ పాల్,షరీఫ్,శ్రీనివాస్ పాల్గొన్నారు…