పోలీసు కళాబృందాలతో అవగాహన సదస్సు.

0
45

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):ఎల్లారెడ్డిపేట్:-

 

ఎల్లారెడ్డిపేట్ మండలంలోని హరిదాస్ నగర్ లో గురువారం రాత్రి గ్రామ ప్రజలకు పోలీసు కళాబృందాలతో దురాచారముల, మూఢనమ్మకాలు పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు.

IMG-20190103-WA0530

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసి పిల్లల భవిష్యత్ పడుచేయవద్దని,చట్టప్రకారం నేరం అవుతుంది అని అన్నారు. మూఢ నమ్మకాలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.

IMG-20190103-WA0531

సాంఘిక దురాచారం పట్ల అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత పట్ల పూర్తి అవగాహనతో మెదులలని , నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసుకోవద్దని తెలిపారు.

IMG-20190103-WA0529
కళాబృందాలతో పలు అంశాలపై అర్థం అయ్యే విదంగా ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,గంగయ్య, రాంచెంద్రం పోలీసు కళా బృందాలు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు…