ప్రజలకు అందుబాటులో పోలీసులు..నేరాలు జరగకుండా జాగ్రత్తలు..జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

0
66

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-ఎల్లారెడ్డిపేట్…

IMG-20190107-WA0415

ఎల్లారెడ్డిపేట్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఏరియా నుండి ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇల్లు సోదాలు చేసి, వాహనాలు తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి, సరైన కాగితాలు లేని 32 ద్విచక్ర వాహనాలకు, 1 ఆటో కు ఫైన్ వేసి పంపించారు.

IMG-20190107-WA0413

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ… 300 ఇండ్లు సోదాలు నిర్వహించామని,10పోలీసు పార్టీలు విడివిడిగా సోదాలు చేసారని,తెలిపారు. గ్రామంలో పోలీసుల పెట్రోలింగ్ తీరు సి సి కెమెరాల పనితీరు, పై గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని స్థానిక పోలీసుల అధికారులకు తెలిపారు.

IMG-20190107-WA0417

ప్రజలకు పోలీసు లు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అని అన్నారు.

IMG-20190107-WA0416

కార్డాన్ సర్చుకు ప్రజలు సహకరించరని, ఇలాంటి తనిఖీలు అన్ని గ్రామాల్లో చేపట్టి శాంతి భద్రతల పట్ల జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

IMG-20190107-WA0414

గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరిగే విదంగా ప్రజలు సహకరించాలని కోరారు.

కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలో సంచరించిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి ఎస్ పి వెంకటరమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు రవీందర్, అనిల్ కుమార్, ఎల్లారెడ్డిపేట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గంభీరావు పెట్ ఎస్ ఐ రాజేశ్వర్ రావు,ముస్తాబాద్ ఎస్ ఐ రాజశేఖర్,వీర్నపల్లి ఎస్ ఐ లాల మురళి,ఏ. ఎస్ ఐ శంకర్ నాయక్,నిజామోద్దీన్,పోలీసు బలగాలు పాల్గొన్నారు….