ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికలు …

0
91

రాజన్న సిరిసిల్ల జిల్లా,.టి రిపోర్టర్(సంపత్ పంజ):- సిరిసిల్ల , 21 జనవరి

IMG-20190121-WA0468

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.

IMG-20190121-WA0470

జిల్లాలోని వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాల పరిధిలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గ్రామీణ ఓటర్లు ఓట్లు వేసేందుకు ఎన్నికల కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

IMG-20190121-WA0467

ఎటువంటిఅవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

IMG-20190121-WA0465
పంచాయితీ ఎన్నికల కేంద్రాలను
పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా ,DRO శ్రీ ఖీమ్యా నాయక్
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా సోమవారం పోలింగ్ సరళిని జిల్లా సంయుక్త కలెక్టర్ , జిల్లా రెవిన్యూ అధికారి పరిశీలించారు. వేములవాడ మండలంలోని చంద్రగిరి , చీర్లవంచ R&R కాలనీ , బోయినిపల్లి మండలంలోని శాభాస్ పల్లి పోలింగ్ కేంద్రాలను జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా సందర్శించి పోలింగ్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు జారీ చేసారు. పోలింగ్ శాతం ను అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు . జిల్లాలోని మొదటి విడత ఎన్నికలు వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాలలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం 82. 60% పోలింగ్ అయినట్లు సంయుక్త కలెక్టర్ తెలియజేశారు. జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ . ఖీమ్యా నాయక్ శిక్షణ కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి బోయినిపల్లి మండలంలోని కొదురుపాక , నీలోజిపల్లి పోలింగ్ కేంద్రాలను సందర్శించారు . జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస్ రావు రుద్రంగి మండలంలోని మానాల పోలింగ్ కేంద్రం ను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు .

కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్
ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 02.00 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రిటర్నింగ్ అధికారులు ,ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు . ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు చేపట్టి ..అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు .

తొలి విడత ..67 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 5 మండలాలలోని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి . తొలివిడతగా జిల్లాలోని వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎన్నికలు అధికారులు నిర్వహించారు .. మొత్తం 80 గ్రామ పంచాయతీలకు గాను.. 13 గ్రామపంచాయతీలు అయ్యాయి . అలాగే 722 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇందులో 188 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 67 సర్పంచ్ స్థానాలకు, 279 మంది, 533 వార్డులకు , 1357 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు . మొదటి విడతలో 33 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేసారు . దీంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి .

వెబ్ క్యాస్టింగ్ ద్వారా …. ఎన్నికల పరిశీలన
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా తొలివిడత ఎన్నికల ప్రక్రియను జిల్లా రెవిన్యూ అధికారి ఖీమ్యా నాయక్ , జిల్లా పంచాయితీ అధికారి శేఖర్ పరిశీలించారు. ఎన్నికల సరళిని పరిశీలించి సజావుగా జరిగేందుకు ఎప్పటికప్పుడు ఎన్నికల సిబ్బందికి సూచనలు చేసారు