ప్రశాంతంగా సాగిన పంచాయతీ ఎన్నికలు ….ఉత్సాహంగా పాల్గొన్న మహిళా మణులు

0
82

 

dharmapuri-sri-laxmi-nrusimha-swamy-1024x683

ధర్మపురి 21 జనవరి 2019, ✍ తెలంగాణ రిపోర్టర్, డా.మధు మహాదేవ శర్మ


👉ధర్మపురి మండలం లో 25 స్థానాలకు గాను ఇరవై రెండు స్థానాలకు ఎన్నికలు
👉మూడు పంచాయతీలు ఏకగ్రీవం

IMG-20190121-WA0366

జగిత్యాల జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం సఫలీకృతమైంది.

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా …ధర్మపురి మండలం లో 25 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు.

బూరుగుపల్లి , గోవింద పల్లె , ఆకు సాయి పల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా,  మిగిలిన 22 గ్రామ పంచాయతీలకు సోమవారం పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.

ఏకగ్రీవ సర్పంచులు గా …బూరుగుపల్లి : కంది తిరుపతి , ఆకుసాయి పల్లెపల్లె : రమేష్ ,గోవిందుపల్లి : పురం శెట్టి రాజయ్య లు  సర్పంంచ్  లుగా ఎన్నికయ్యారు..

మిగిలిన ఇరవై రెండు స్థానాలకు గాను:

దమ్మన్నపేట్ — పులిశెట్టి మల్లేశం       రాజారాం. — రంగు మమత

జైన. — జంగిలి ప్రభాకర్ రావు

దొంతపూర్…. k. రాం చందర్ రావ్
ఆరెపెళ్లి …… బోర్లకుంట కమల
మగ్గిడి. — దుర్గం శ్రీనివాస్
కొస్నుర్ పల్లె — ఎ న్నం లక్ష్మారెడ్డి
తీగలధర్మారం .. A. ఆండాలు
గాదెపెళ్లి … అల్పట్ల మమత
దొనూర్ …. కొండపెళ్లి సువర్ణ
పెద్ద నక్కలపెట్ — మొగిలి శేఖర్
దుబ్బలగూడెం.-దస్తూరి నర్సయ్య
బోదెర గూడెం –అద్దరి బుచ్చవ్వ
నాగారం .. రూపు సత్తవ్వ
కమలాపూర్ … కొండపెళ్లి లక్ష్మి
రామయ్యపల్లె .మెడపట్లదుబ్బయ్య
తిమ్మాపూర్… కాళ్ళ శేఖర్
రాయపట్నం… ఈర్ల చిన్నక్క
బురుదేశపల్లె… కడారి చిన్న నర్సు
నర్సయ్యపల్లె….నేరెళ్ళ లావణ్య
తుమ్మనాలె .. వేముల లక్ష్మి
నేరెళ్ళ …. పాలిగిరి వసుంధర లు విజయాన్ని సాధించారు.
ధర్మపురి మండలంలోని 25 గ్రామపంచాయతీలో 21 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయ పతాకం ఎగుర వేయగా
మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు మరో స్థానంలో  బిజేపి విజయాన్ని సాధించింది.

ధర్మపురి మండలం లోని 25 గ్రామాలకు గాను 32271 మంది ఓటర్లు ఉండగా
అందులో 15713 పురుషులు 16588 మంది స్త్రీలు ఉన్నారు.

సోమవారం నాడు జరిగిన ఎన్నికల్లో 24 వేల 475 ఓట్లు పోల్ కాగా అందులో పదివేల 783 మంది పురుషులు 13 వేల ఆరు వందల 92 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
మొత్తంమీద చూసినట్లయితే పంచాయతీ ఎన్నికల్లో మహిళలదే పై చేయి గా కనబడుతున్నది.