ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే జగన్‌తో భేటీ…టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
96

హైదరాబాద్:

  • ప్రజాకాంక్షకు అనుగుణంగా రాజకీయాలు ఉండాలి
  • ప్రత్యేక హోదా అంశంలో సంపూర్ణ మద్దతు…

ktrjagan

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏడాది కాలంగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

ktr

నగరంలోని లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో జరిగిన కేటీఆర్ భేటీ  అనంతరం… కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే జగన్‌తో భేటీ అయినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో సమాఖ్య స్ఫూర్తి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పలువురు జాతీయ నేతలతో కేసీఆర్ ఇప్పటికే చర్చించారన్నారు. ఈ క్రమంలో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై మాట్లాడేందుకు జగన్ వద్దకు వచ్చామన్నారు.

ప్రజాకాంక్షకు అనుగుణంగా రాజకీయాలు ఉండాలి. త్వరలో ఏపీకి వెళ్లి అక్కడి నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతారని తెలిపారు. త్వరలో కేసీఆర్ స్వయంగా ఏపీకి వెళ్లి జగన్‌తో చర్చిస్తారని చెప్పారు. జగన్ తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు..

ప్రత్యేక హోదా అంశంలో సంపూర్ణ మద్దతు..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్‌ఎస్ వైఖరిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సహా తమ ఎంపీలు అనేక సార్లు చెప్పారన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. నాడు ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరామని పేర్కొన్నారు.