ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షనీయo…. వైసీపీ అధినేత వైఎస్ జగన్

0
79

హైదరాబాద్: sircilla srinivas, 9849162111


  • టీఆర్‌ఎస్‌తో చర్చలు స్వాగతించదగ్గ విషయo
  • 17 మంది తెలంగాణ ఎంపీలు కలిస్తే రాష్ర్టానికి ప్రయోజనం ఉంటుంది.    42 మంది ఎంపీలు కలిసి పోరాడితే రాష్ర్టానికి మేలు జరుగుతుంది
  • పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు దివానా లేదు

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షనీయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొనియాడారు.

YS-jagan-press-meet

కేటీఆర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా రాష్ర్టాలు కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు….ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్‌తో చర్చించాం. జాతీయస్థాయిలో రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాల్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కు దివానా లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఇందుకు ఉదాహరణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. 17 మంది తెలంగాణ ఎంపీలు కలిస్తే రాష్ర్టానికి ప్రయోజనం ఉంటుంది. 42 మంది ఎంపీలు కలిసి పోరాడితే రాష్ర్టానికి మేలు జరుగుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌తో చర్చలు స్వాగతించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యా బలం పెరగాలన్నారు. రాష్ర్టాలు ఒకే తాటిపైకి వస్తే అన్యాయం చేసేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై రాష్ర్టాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే వీలుంటుందన్నారు. భావసారూప్య పార్టీలను ఒకే వేదికపైకి తేవాలన్న కేసీఆర్ నిర్ణయం హర్షనీయమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రస్తుతం జరిగిన సమాలోచనలు ప్రాథమిక చర్చలు మాత్రమేనని.. ఇంకా కొనసాగుతాయని జగన్ పేర్కొన్నారు.