భవాని సెల్ పాయింట్ లో జరిగిన చోరీ లో 23,50,620 రూపాయల విలువ గల ఫోన్ లను మరియు LOT మొబైల్ షాప్ లో 10,37,104 రూపాయల విలువ గల ఫోన్ ల చోరీ

0
48

జగిత్యాల జిల్లా: sircilla srinivas, 9849162111, telanganareporter.news


జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారి జామున అంగడి బజారులోని భవాని సెల్ పాయింట్ లో జరిగిన చోరీ లో 23,50,620 రూపాయల విలువ గల ఫోన్ లను

మరియు LOT మొబైల్ షాప్ లో 10,37,104 రూపాయల విలువ గల ఫోన్ లను  దొంగలు దోచుకెళ్లిన తీరుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

IMG-20190109-WA0821

మొత్తం ఫోన్ ల విలువ 33,87,724 రూపాయలుంటుందనీ…ఈ సందర్బంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్న ఎస్ పి సింధుశర్మ  వెల్లడించారు.
చోరీ జరిగిన సంఘటన స్థలంలో క్లూస్ టీం సిబ్బంది ఆధారాలను సేకరించింది.

 

సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని, చోరీ జరిగిన తీరును పరిశీలించారు.

 

IMG-20190109-WA0072

ఆమెతోపాటుగా అదనపు ఎస్పీ మురళీధర్, డిఎస్పీ వెంకటరమణ, సిఐలు ప్రకాష్, నాగేందర్, ఇంటలిజెన్స్, ఎస్ బి పోలీసులున్నారు.

IMG-20190109-WA0070

ఈ సందర్బంగా ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ, చోరీ చేసిన వారి గురించి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ సింధు శర్మ తెలిపారు.