భవిష్యత్ ప్రపంచ మార్గ నిర్దేశకులుగా యువత తయారుకావాలి….. రాష్ట్ర గవర్నర్ ఇవిఎల్ నరసింహన్

0
56

Hyderabad, sircilla srinivas, 9849162111


IMG-20190120-WA0391

భవిష్యత్ ప్రపంచ మార్గ నిర్దేశకులుగా యువత తయారుకావాలని రాష్ట్ర గవర్నర్ ఇవిఎల్ నరసింహన్ పిలుపు నిచ్చారు.

IMG-20190120-WA0447

హైదరాబాద్ లోని హెచ్ ఐ సీసి లో మూడురోజులపాటు తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సును నిర్వహించింది.

IMG-20190120-WA0446

ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశానికి రాష్ట్ర గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ప్రతినిధులకు పలు అంశాలను వివరిస్తూ…భవిష్యత్ ప్రపంచ మార్గ నిర్దేశకులుగా తయారుకావాలని పిలుపు నిచ్చారు.

IMG-20190120-WA0449

ఈ సందర్భంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపి కవిత మాట్లాడుతూ…
మహిళలు సాధికారత సాధించేందుకు పురుషులు సహకరించాలని నిజామాబాద్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
సమాజంలో సగభాగం అయిన మహిళలు…
ఆ స్థాయిలో వారు ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలని కోరారు.

IMG-20190120-WA0397

రెండు రోజుల పాటు జరిగిన సదస్సుకు 50 శాతంకు పైగా మహిళా ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.

IMG-20190120-WA0390

సదస్సుకు హాజరైన యూత్ , మహిళలు ఎదిగేందుకు అందించాల్సిన తోడ్పాటును బాధ్యతగా నెరవేర్చాలని కవిత ప్రతినిధులను కోరారు.

IMG-20190120-WA0393

గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అంశంపై సదస్సు అన్ని కోణాల్లో విస్తృతంగా చర్చించిందని కవిత చెప్పారు.

IMG-20190120-WA0395

తెలంగాణ జాగృతి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంతో నైపుణ్య శిక్షణ, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోందని తెలిపారు.

IMG-20190120-WA0394

గవర్నర్ నరసింహన్ స్కిల్స్ సెంటర్ ను ప్రారంభించారని కవిత చెప్పారు.ఇప్పటి వరకు 19 వేల మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చామని, వారిలో 15 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించాయని తెలిపారు.యూత్ ఆచీవర్ అవార్డు గ్రహీత మాలోవతు పూర్ణ మనందరికీ గర్వకారణం అన్నారు.పూర్ణ , రెజ్లార్ బబిత లు నేటి యువతకు స్ఫూర్తి అన్నారు. వాటర్ మాన్ ఆఫ్ ఇండియా గా పేరొందిన రాజేందర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు…ఆయన జన్మ దినం పురస్కరించుకుని తెలంగాణ లో అనేక నీటి సంరక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి..తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణ చేపడ్తూనే, నీటి వనరుల సద్వినియోగం కు కృషి చేస్తున్నదని కవిత వివరించారు.

జాగృతి అంటేనే మేలుకొలుపు…గవర్నర్ నరసింహన్
కవిత ఆధ్వర్యంలో జాగృతి బాగా పనిచేస్తోంది. యువత అంటే.. మహిళలు కూడా అనే అంశం మరువకూడదు…యువత భుజం భుజం కలిపి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలి

అహింసా మార్గంలో దేశానికి మహాత్ముడు మార్గం చూపాడు. మనం ఏది సాదించాలన్నా ఆ మార్గంలో పనిచేయాలి…గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ యూత్ కోసం జాగృతి చేస్తోన్న కృషి అభినందనీయం..యువతలో ఓపిక, సహనం తక్కువ. అవి అలవర్చుకున్నప్పుడే ఏదయినా సాదించగలరు

యువత ఈ లక్షణాలు అలవర్చుకోవాలి

నాణ్యమైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం. కుటుంబంలో బాలిక చదువు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి….స్త్రీ.. పురుషుల మధ్య అసమానతలు తొలగాలి. అప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యం…హద్దు దాటి చెట్ల నరికివేత, విపరీత మైనింగ్ ఎప్పటికీ ప్రమాదకరమే..ప్రకృతి ని కాపాడుకోవడం మన సంప్రదాయంలో భాగం అవసరం, ఆశ మధ్య వ్యత్యాసం ఉండాలి.చెట్లను నాటడంతో పాటు.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి.మహిళాసాధికారత అంటే.. ఆమె కోరుకున్న చదువు, ఉద్యోగం, జీవితం తాను పొందటం నూతన ఆవిష్కరణలకు యువత అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవాలి.

 

IMG-20190120-WA0396

సమావేశంలో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్, రెజ్లర్ బబిత, మాలోవత్ పూర్ణ పాల్గొన్నారు.