మనం ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటోను పంపించింది… చైనాకు చెందిన చాంగె-4 స్పేస్‌క్రాఫ్ట్

0
70

బీజింగ్:

మనం ఇప్పటివరకు చూడని చంద్రుని ఫొటోను పంపించింది చైనాకు చెందిన చాంగె-4 స్పేస్‌క్రాఫ్ట్.

moon panoramic view

చరిత్రలో తొలిసారి జనవరి 3న చంద్రుని అవతలి వైపు మనిషి పంపిన స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండైన విషయం తెలిసిందే. యుటూ 2 అనే రోవర్ ల్యాండర్ నుంచి విజయవంతంగా వేరుపడింది. గురువారమే అది చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లింది.

చాలంగె-4లోని కెమెరా చంద్రుడి పనోరమిక్ ఫొటోను తీసి భూమికి పంపించింది. దీనిని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్‌ఎస్‌ఏ) శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫొటోలో చంద్రుడితోపాటు ల్యాండర్, రోవర్ కూడా కనిపిస్తున్నాయి. ల్యాండింగ్ సైట్‌లో చంద్రుడి ఉపరితలానికి సంబంధించి సైంటిస్టులు ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణ కూడా జరిపినట్లు చైనా స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. అంతా తమ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్లు వివరించింది. ఐదు రోజుల పాటు స్టాండ్ బై మోడ్‌లో ఉన్న 140 కిలోల రోవర్.. గురువారం నుంచే పని మొదలుపెట్టింది. చంద్రుడి గురించి ఇప్పటివరకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి చంద్రుడి చీకటి భాగమే కీలకమని సైంటిస్టులు భావిస్తున్నారు.