మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం

0
63

SIRCILLA SRINIVAS, 9849162111


Rajanna Siricilla Dist, Vemulawada, Sampath panja/Raju


images (1)

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ….

DSC_8481

మహా శివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు , జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

DSC_8448

కావాల్సిన వనరులు అందిస్తాం..మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలి…. జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి…రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ) జనవరి22….దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో మార్చి నెలలో జరుగనున్న మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు పనులు ముమ్మరంగా చేయడానికి మంగళవారం రోజున జిల్లా అధికారుల తో వేములవాడ దేవస్థానం లో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ జాతర ఏర్పాట్లు చేయడానికి వనరులు మేము అందిస్తాం.మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా అధికారులు అందరూ సమన్వయం తో పని చేయాలని కోరారు. జాతర ఏర్పాట్లు చేయడంలో 17 శాఖలు పనిచేస్తున్నామని అందులో ముఖ్యంగా శానిటేషన్ విభాగం పాత్ర ఎంతో కీలకమైన పాత్ర అని సంబంధించిన అధికారులు అన్ని శాఖల కంటే ఎక్కువ శ్రేద్ద చూపి పరిసరాలు శుభ్రంగా ఉండే విదంగా చూడాలని కోరారు. ఇరిగేషన్ శాఖ,నీటి సమస్య లు తలెత్తకుండా ఎప్పటి కప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చురుకుగా పనిచేయాలని ,ప్రధాన కూడలిలో, జనం ఎక్కువగా ఉండే చోటు లో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి ,శ్రద్ధతో చురుకుగా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా విధులు నిర్వహించే వైద్యులను ఎన్నిక చేసి వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరా కు ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు…..జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ భద్రత ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది అని,బృందాలుగా పోలీసుసిబ్బంది విధులు నిర్వహిస్తు భక్తులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేక నిఘా విభాగంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాస్ ఉన్న పాత్రికేయులను పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వడం లేదని పాత్రికేయులు అడుగగా, ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని పాస్ ఉన్న వారిని తప్పకుండా అనుమతించే విదంగా చూస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వెంకట్రామ రెడ్డి, ఎస్పీ రాహుల్ హెగ్డే, స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు,ఇ ఓ రాజేశ్వర్ రావు,ఆర్ డి ఓ శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు….

 DSC_8494DSC_8640

 DSC_8544 DSC_8504DSC_8551 DSC_8633

DSC_8452 DSC_8504 DSC_8403 DSC_8425 DSC_8428