ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం – ట్రస్మా రాష్ట్ర సలహాదారు సీ హెచ్ వి ప్రభాకర రావు

0
53

IMG_20181228_225709

 

Jagtial,

sircilla srinivas, 9849162111, telanganareporter.news


తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలకు తోడుగా ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యాన్ని తీసుకుంటామన్న

CM-KCR

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) రాష్ట్ర సలహాదారు సీ హెచ్ వీ ప్రభాకర రావు

chv prao

జిల్లా అధ్యక్షులు బోగ రవిప్రసాద్

oxford raviprasad

రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమురవెల్లి కిషన్బి జగన్ మోహన రావు, పట్టణ కార్యదర్శి కస్తూరి రాంబాబు లు  అన్నారు.

ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల భాగస్వామ్యం పై ప్రస్తావన తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సుమారుగా 13 వేల పాఠశాలల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, అందులో 52 శాతం విద్యార్థులు చదువుతున్నారని, 3 లక్షల వరకు బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.

తమ పాఠశాలల్లో కూడా అర్హత కలిగిన ఉపాద్యాయులు పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటుగా, ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా శిక్షణ అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలను గుర్తించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రైవేట్ పాఠశాలలకు అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని అక్షరాస్యతలో అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు.

నేటికీ ఫలితాల పరంగా ప్రైవేట్ పాఠశాలలు ముందంజలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయని వాటికి ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయని అన్నారు.

అతి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.