మునిసిపల్ సాధారణ సమావేశం లో పాల్గొన్న జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

0
73

IMG_20181228_225709

జగిత్యాల: Sircilla Srinivas, 9849162111


IMG_20190111_212110

మొదటి సారి జగిత్యాల మునిసిపల్ సాధారణ సమావేశం లో శుక్రవారం పాల్గొన్న జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను పుష్పగుచ్ఛం,శాలువ తో మునిసిపల్ చైర్పెర్సన్ శ్రీమతి టి. విజయలక్ష్మి మరియు

IMG-20190111-WA0582

కౌన్సిలర్లు,అధికారులు సన్మానించారు.

IMG-20190111-WA0551

మిషన్ భగీరథ ద్వారా 6 నెలలుగా నీటి వినియోగం పై
జగిత్యాల మునిసిపల్ చెల్లించాల్సిన 2 కోట్ల రూపాయల గురించి సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
జగిత్యాల పట్టణం లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.

అంగన్వాడీ టీచర్, ఆయాలు భర్తీ లో రోస్టర్ పాయింట్ పద్దతి పాటించాలన్నారు.

మాజీ మంత్రి కే టి ఆర్ సహకారంతో మంజూరైన నిధులతో జగిత్యాల పట్టణం లో వివిధ కుల సంఘాలకు నిధులు, వీధి దీపాల ఏర్పాటు, సీసీ కెమెరాల ఏర్పాటు, పట్టణ సుందరికరణ ,సీసీ రోడ్లు,బి టి రోడ్లు, ఖిల్లా సుందరీకరణ చేపట్టనున్నట్లు
రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని స్థానిక శాసన సభ్యులు స్పష్టం చేశారు..

మునిసిపల్ సాధారణ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పకుండా హాజరు అయ్యేలా చూడాలని శాసనసభ్యులు సంజయ్ కుమార్ మునిసిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు..

ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ మన్సూర్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్,అధికారులు మరియు కౌన్సిలర్లు తదితరులుపాల్గొన్నారు.