మృగారణ్యం…
ఎన్ని జాగ్రత్తలుఎన్ని హెచ్చరికలుఎన్ని భయాలుబాల్యంనుండీపాటిస్తూనే అడుగు కదిపినా
వేధిస్తూ సాధిస్తూకాటేయాలనే మాటువేసినజనారణ్యంలో మృగాల మధ్యబతికలేక బలైపోతుంటే
ఎంత ఎదిగి ఏం లాభం ఆకలిగొన్న నరరూప రాక్షసులు మాన ప్రాణాాలను హహరించ కాపుకాస్తుంటే
చదువులని , ఉద్యోగాలని ధైర్యంగా బయటకు పంపలేని ధైన్యం ఆడపిల్ల క్షేమంగా ఇల్లు చేరేదాకాకన్నవాళ్ళ మనసుల్లో భయం ముళ్ళులా గుచ్చుతూనే ఉంటే
ఇక చెప్పాల్సింది భయం కాదుమనమున్నది జనం మధ్యకాదుమృగారణ్యంలోబయటకెల్తే రక్షణకుకళ్ళద్దాలు ఖర్చీఫులూ కాదుకత్తులు తుపాకులు తీసుకెళ్ళాలని
అడుగడుగునా ఎదురుపడేఅనుమానితున్ని సైతం హతమార్చితే తప్పఅతివకు రక్షణనన్నది దొరకదేమో…!
–అనూశ్రీ, గోదావరిఖని