మొదటి వారంలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరందించాలి….ఎమ్మెల్యే గంగుల కమలాకర్

0
56

మొదటి వారంలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరందించాలి..

* ట్యాంకుల నిర్మాణాలు ,పైపు లైను పనులు త్వరితగతిన పూర్తి చేయాలి…

* అవసరమైతే పోలీస్ , రెవిన్యూ సహకారంతో పనులు నిర్వహించాలి….ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ……

మిషన్ భగీరథ ద్వారా నిహాజకవర్గంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు....

IMG-20190122-WA0344

నేడు మంగళవారం మీ సేవా కార్యాలయంలో కరీంనగర్ రూరల్ ,కొత్తపల్లిమండలాలలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిపై , మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు..

పనులలో జాప్యం పై అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసినారు… పైపులైన్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు…

తీగల గుట్టపల్లి లోని చంద్రపురి కాలనీ , సీతారాంపూర్, కొత్తపల్లి గ్రామాలలో ట్యాంకుల నిర్మాణం నిలిచిపోవడం పై ఎమ్మెల్యే అధికారులను ఆరా తీశారు….పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అవసరమైతే రెవిన్యూ పోలీసు అధికారుల సహకారంతో మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు..

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ట్యాంకుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అన్ని గ్రామాలకు మంచి నీరు అందించాలని అధికారులకు సూచించారు…. మిషన్ భగీరథ పైపు లైన్ పనులు , ట్యాంక్ నిర్మాణం , ఇంటవిలేజీ పనులు త్వరితగతిన పూర్తిచేసి ఏప్రిల్ మొదటి వారంలో ని 57 ఆవాసలకు బల్క్ వాటర్ అందించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు….

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టిందన్నారు… కానీ కరీంనగర్ లో మిషన్ భగీరథ పనులు నత్తనడకన నడుస్తున్నాయని పైపులైను నిర్మాణంలో జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన వేల కోట్ల రూపాయలతో నూతనంగా వేసిన రోడ్లు మళ్లీ మళ్లీ తవ్వడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు…

మిషన్ భగీరథ కు ప్రధాన ఆటంకమై న ట్యాంకుల నిర్మాణం రోడ్ క్రాస్ రోడ్డు పనులను వేగంగా పూర్తిచేసి ఇంటర్ లింక్ కలెక్షన్లు ఇవ్వాలని అధికారులకు గంగుల కమలాకర్ సూచించారు… ఎట్టి పరిస్థితుల్లోనూ నగర ప్రజలకు ఏప్రిల్ మొదటి వారంలో స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు…

ఈ కార్యక్రమంలో ఎంపీపి వాసాల రమేష్ ,నాయకులు కాశెట్టి శ్రీనివాస్ , మిషన్ భగీరథ ఎస్ ఈ అమరేంద్ర , ఈ ఈ చల్మరెడ్డి ,ఆర్ డబ్ల్యు ఎస్ ఈ ఈ ఉప్పలయ్య , మిషన్ భగీరథ డి ఈ ప్రభాకర్ చారి , ఆర్డబ్ల్యూఎస్ డి ఈ రామ్ కుమార్ ,ఏ ఈ లు షరాన్ ,మహేందర్, సూర్య ప్రకాష్ , కాంట్రాక్టర్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు…