మొద్దు నిద్రలో ఉన్న ఆ తోవ..

0
24

మొద్దు నిద్రలో ఉన్న ఆ తోవ..

ఈ లోకానికి దారి చూపే
దేవతవు నీవు
ఈ సృష్టికి మూలం నీవు
నీపైనే ఈ ఆగాయిత్యమేలా ఓ తల్లి..

కూతురిగా వచ్చావు
తోబుట్టువుగా ఆదరించావు
తల్లిగా లాలించావు
ఏమిచ్చి నీ రుణం తీసుకోవాలి ఓ చెల్లి..

భయం భయంగా చీకటిలో
అడుగేస్తూ నీ వెనకాలే
వస్తున్న ఆ కామాంధుల
కబంధ హస్తాలలో నలిగిపోతివి..

నిశ్శబ్ద రాత్రిలో
మొద్దు నిద్రలో ఉన్న ఆ తోవ
నీకు యమ పాశమాయే
ఆ కాళరాత్రే నీకు ఉరితాడాయే
ఏ చేయి నీకు అండగా
నిలవలేదయే..

చట్టాలెన్నున్నా
అవి చుట్టాలై పెనవేసుకొని ఉండే..
ఇంతటి ఘోరం చేసిన
ఆ రాక్షసులకు నడిరోడ్డుపైనే
మరణ శిక్ష వేస్తే
నీచుల గుండెల్లో
గుబులు పుట్టించవచ్చు
ఆ కామాంధుల ఆటలూ కట్టించవచ్చు.
😢😰😢😰

వోదెల గంగాధర్…జగిత్యాల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here