రామగుండంలో అవిశ్వాసం నెగ్గింది..

0
148

www.telaganareporter.news✍9394328296

అవిశ్వాసం నెగ్గింది..

20180802_105445
👉మేయర్ పదవిని కోల్పోయిన కొంకటి లక్ష్మీనారాయణ..
👉పంతాన్ని  నెగ్గించుకొన్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ..

👉విప్ జారీ చేసినా పట్టించుకోకుండా అవిశ్వాసంలో ఎమ్మెల్యే తో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు..

20180802_130122

👉పదవిని కోల్పోయిన మేయర్ లక్ష్మీనారాయణతో పాటు డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్..

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, ఆగస్టు-2, తెలంగాణ రిపోర్టర్-(దినేష్):- 

మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసంలో ఏకదాటిపై ఎమ్మెల్యే అనుచరవర్గం తో పాటు కాంగ్రెస్ కార్పొరేటర్లు రామగుండం రాజకీయాన్ని పరుగు పెట్టించారు..
గురువారం జరిగిన రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ల అవిశ్వాసం హాట్ హాట్ గా మారింది..
ఉదయం 10-30 గంటలకు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం కు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తో పాటు 37 మంది కార్పొరేటర్లు అవిశ్వాస సమావేశంలో పాల్గొన్నారు… దింతో మేయర్ లక్ష్మీనారాయణతో పాటు డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ల పదవి కోల్పోవడం జరిగింది.. అవిశ్వాసం నెగ్గడంతో ఎమ్మెల్యే అనుచరులు సంబరాలు చేసుకున్నారు..

20180802_124730
👉 రామగుండం మున్సిపల్ మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మాన విషయంలో మొదటి ఘట్టంలో….
👉 గురువారం ఉదయం 10.45 నిమిషాలకు ఎమ్మెల్యే సోమరపు వర్గానికి చెందిన 28 మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు క్యాంపు నుండి బస్ లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
👉కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది , బీజేపీ కి చెందిన ఒకరు తమ తమ వాహనాలలో కార్యాలయనికి వచ్చారు..
👉 మేయర్ కొంకటి వర్గానికి చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస సమావేశానికి హాజరు కాలేదు..

IMG-20180802-WA0014
👉 అవిశ్వాస తీర్మానం సంబంధించి ప్రిసైడింగ్ అధికారిగా వనజా దేవి వ్యహరిoచారు..
👉పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తు నిర్వహించగా, మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతికపోవడంతో మీడియా ప్రతినిధులు చెట్ల క్రింద ఇబ్బందులు పడ్డారు..

IMG-20180802-WA0012

👉అవిశ్వాసం నెగ్గడంతో ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతూ..
రామగుండం మేయర్ గా ఉన్న లక్ష్మీనారాయణ తన పదవి కాలంలో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కుంటుపడిందన్నారు.. కార్పొరేటర్ల మద్దతుతో అవిశ్వాసంలో గెలుపొందామని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు… త్వరలో నూతన మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక విషయంలో కార్పొరేటర్ల తో చర్చించి తుది నిర్ణయంతో ఎన్నుకొంటామన్నారు..

20180802_121034