రాలేగావ్ సిద్ధిలో ఈ నెల 30వ తేదీ నుంచి నిరాహారదీక్ష – ప్రముఖ గాంధేయవాది అన్నా హాజారే

0
87

హైదరాబాద్:

ఈ నెల 30వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ గాంధేయవాది అన్నా హాజారే తెలిపారు.

08-anna-hazare02-300

తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు…. లోక్‌పాల్‌, లోకాయుక్త 2013లో తయారైంది. 2014లో చట్టరూపం దాల్చింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రకటించారు.

అదేఏడాదిలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎంతో కొంత దీనిపై ముందడుగు పడుతుందని ఆశించాం. కానీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు. అధికారం చేపట్టి ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. ఇందుకు నిరసనగా తాను ఈ నెల 30వ తేదీ నుంచి తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు అన్నా హాజారే పేర్కొన్నారు.