రాష్ట్ర ఆర్థిక నిధులు వివిధ శాఖల ద్వారా పన్నులు మరియు పన్నేతర ఆదాయ వివరాలపై సమీక్ష

0
108

IMG_20181209_183521_0

తేది:11.01.2019 Hyderabad, sircilla srinivas, 9849162111, telanganareporter


IMG-20190111-WA0547

రాష్ట్ర ఆర్థిక సంఘం ముఖ్య కార్యదర్శి (ఆర్ధిక శాఖ)తో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మెన్ జి.రాజేశం గౌడ్, సభ్యులు చెన్నయ్య సమావేశమై …2014-15 నుండి 2017-18 సంవత్సరం వరకు రాష్ట్ర ఆర్థిక నిధులు వివిధ శాఖల ద్వారా పన్నులు మరియు పన్నేతర ఆదాయ వివరాలపై సమీక్ష నిర్వహించారు…

2014-15 సంవత్సరం లో పనుల ద్వారా రూ.6,446.82 కోట్లు,
2015-16 సంవత్సరమునకు రూ.14,414.36 కోట్లు, 2016-17 సంవత్సరమునకు రూ.9,781.71 కోట్లు, 2017-18 సంవత్సరమునకు రూ.65.99 కోట్ల పన్నుల ఆదాయము సమకూర్చబడినదని వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మెన్ జి.రాజేశం గౌడ్ సంబంధిత వివరాలను వెల్లడిస్తూ….

పైన పేర్కొన పన్నుల ఆదాయము నుండి గ్రామ పంచాయతీలకు, పురపాలక సంఘములకు మరియు కార్పోరేషన్లకు వివిధ శాఖల ద్వారా కేటాయించిన విధుల వివరములు ఈ క్రింది విధంగా వున్నవి.

1. కమీషనర్ పంచాయతీరాజ్ 2014-15 నుండి సినరేజ్ ద్వారా రూ.2226.9 కోట్ల ఆదాయం 2017-18 వరకు పొందగా 57.83 కోట్లు స్థానిక సంస్థలకు బదిలీ చేయనైనది ఇంకను రూ.2169.07 కోట్ల నిధులు బదలాయించ వలసి ఉన్నవి.

2. ట్రాన్స్ఫర్ అఫ్ అసైన్డ్ రెవిన్యూ లోకల్ బాడీస్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి 2014-15 నుండి 2017-18 వరకు వసూలైన మొత్తం రూ.2907.18 కోట్లు స్థానిక సంస్థలకు కేటాయించిన మొత్తం రూ2794.57 కోట్లు, రూ.112.61 కోట్లు ఇంకా స్థానిక సంస్థలకు కేటాయించ వలసి ఉన్నవి.

జరగబోవు గ్రామపంచాయతి సర్పంచుల ఎన్నిక తర్వాత ఎన్నికైన సర్పంచులతో పంచాయతీ నిధుల, విధులకు సంబందించి అవగాహనా సదస్సును నిర్వహించుటకు నిర్ణయించడం జరిగిందని వివరించారు.

అలాగే, ముఖ్యమంత్రి కెసిఆర్ పంచాయతీలకు రూ.1,500 కోట్ల నిధిని కేటాయించుటకు నిర్ణయించినారు.

అట్టి నిధులను ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేటాయించబడును.

ఇతర శాఖల ద్వారా స్థానిక సంస్థలకు రావలసిన బకాయిల గురించి ఆయా శాఖల అధిపతులతో సమావేశమును నిర్వహించి అట్టి బకాయిలను పంచాయతీలకు చేరేవిధంగా ఆర్థిక సంఘం చర్యలు తీసుకొనుటకు నిర్ణయించనైనది.

ఆర్థిక సంఘం ఇదివరకే కర్ణాటక, ఢిల్లీ , మహారాష్ట్ర రాష్ట్రాల పర్యటన చేసి అక్కడ స్థానిక సంస్థల ఆర్థిక వనరులు, సేవలు తదితర విషయాలను పరిశీలించడం అయినది.

మరియు ఈ సంవత్సరం అనగా 2019 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ , ఆంధ్రప్రదేశ్ రాష్త్రంల పర్యటన చేయాలని ఆర్థిక సంఘం నిర్ణయించింది.

ఈ సంవత్సరంలో కూడా చైర్మెన్స్, ఛైర్ పర్సన్స్, సీఈఓ, జెడ్.పి.పి లతో మరియు మేయర్స్, ఛైర్ పర్సన్స్, మరియు మునిసిపల్ కమిషనర్లతో సమావేశంను నిర్వహించి సదరు స్థానిక సంస్థల బలోపేతానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించుటకు నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మెన్ జి.రాజేశం గౌడ్ వివరించారు.