రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది అధికారులు కండువా లేని నాయకులుగా వ్యవహరిస్తున్నారు….మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

0
47

సారంగపూర్, జగిత్యాల జిల్లా: sircilla srinivas, 9849162111


దళితులను వివక్షతకు గురి చేసి వారి సీట్లను వారికి కేటాయించకుండా ఓసీలకు కేటాయించిన విషయమై న్యాయస్థానానికి వెళ్లి అధికారులకు శిక్షపడేలా చేస్తా..

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

IMG-20190116-WA0254

స్థానిక సంస్థల ఎన్నికలలో దళితులను టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వివక్షతకు గురి చేసిందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు .

సారంగపూర్ మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
జగిత్యాల నియోజక వర్గంలోనే పలు గ్రామాలలో ఎస్సిలు అధికంగా ఉన్నా.. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు గురయ్యి ఎస్సి స్థానాలను ఓ సి లు గా మార్చారని అన్నారు .

రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది అధికారులు కండువా లేని నాయకులుగా వ్యవహరిస్తూ అధికారపార్టీ కి తొత్తులుగా పని చేస్తున్నారన్నారు .

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పక్రియను అపహాస్యం పాలు చేసి దళితులను వివక్షతకు గురి చేసి వారి సీట్లను వారికి కేటాయించకుండా ఓసీలకు కేటాయించిన విషయమై న్యాయస్థానానికి వెళ్లి అధికారులకు శిక్షపడేలా చేస్తానని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు .

రాగద్వేషాలకు , రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులలో పాలుపంచుకుంటామని ప్రమాణం చేసి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించిన గ్రామాలకే అభివృద్ధి నిధులను మంజూరు చేస్తామని ఆయా గ్రామాలే అభివృద్ధి జరుగుతాయని పేర్కొనడం రాజ్యాంగాన్ని అపహాస్యంపాలు చేయడమేనని జీవన్ రెడ్డి విమర్శించారు .

టిఆర్ఎస్ నాయకులు , మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ మద్దతు ఉన్న నాయకులను స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించాలని కోరడం, వారు గెలిచిన చోట్ల లోనే అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని పేర్కొనడం ఏమిటని జీవన్ రెడ్డి ప్రశ్నించారు .

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను జీవన్ రెడ్డి ప్రదర్శించారు.

గత నాలుగేళ్ల ఆర్ ఎస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకుండా స్థానిక సంస్థలను నిర్వీర్య పరిచేలా వ్యవహరించిందని అన్నారు .

సర్పంచులను చులకన చేసే విధంగా ప్రశ్నించేవాడి గొంతు నొక్కేలా పంచాయతీరాజ్ శాఖ నూతన చట్టం లో మార్పులు చేసి జాయింట్ చెక్  పవర్ ను అమలుపరచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాలకు కెసిఆర్ కత్తెర వేశారని అన్నారు.

గత నాలుగేళ్ల రాష్ట్ర ప్రభుత్వంలో మన ఊరు మన ప్రణాళిక , గ్రామ జ్యోతి కార్యక్రమాలను నిర్వహించిన ప్రభుత్వం గ్రామాలకు నిధులు కేటాయించకుండా ఇప్పుడు అభివృద్ధి చేస్తామని పేర్కొనడం ఏమిటన్నారు .

రాష్ట్ర ప్రభుత్వం సానిక సంస్థలకు విధిగా కేటాయించాల్సిన sfc , mnp, సినరేజి , తలసరి గ్రాంట్ నిధులను చేయకుండా వివక్షతకు గురి చేశారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 73 , 74 రాజ్యాంగ సవరణ కు అనుగుణంగా స్థానిక సంస్థలకు అందుతున్న నిధుల కేటాయింపు తోనే గ్రామాల్లో అభివృద్ధి చెందాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా విడుదల చేయలేదన్నారు.

గతంలో ఉన్న యూపీఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కేంద్రం నిధులతోనే గ్రామాలలో సిసి రోడ్లు , మురుగు కాల్వలు , వైకుంఠ దామం , ఇతర అభివృద్ధి పనులు కొనసాగాయని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 22 శాతానికి కుదించి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు.

పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా రిజర్వేషన్ల ప్రక్రియ కు కేసీఆర్ సర్కార్ విఘాతం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.