రూ. 11 లక్షలు విలువ గల 51 కిలోల గంజాయి స్వాధీనం

0
51

sircilla srinivas, 9849162111


రామగుండం: Dinesh, Telanganareporter


IMG-20190120-WA0073

కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా మంథని , పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకుని, రూ.సుమారు రూ. 11 లక్షలు విలువ గల 51 కిలోల  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

IMG-20190120-WA0074

వివరాల్లోకి వెళితే:

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు, గోదావరిఖని ఎసిపి రక్షిత కే మూర్తి గారి అధ్వర్యంలో సిఐ సాగర్ , సిఐ సరిలాల్ తన సిబ్బందితో కలిసి పెద్దపల్లి జిల్లా మంథని , పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో గంజాయి అమ్ముతున్నరనే  సమాచారం మేరకు ….
మంథని పోలీస్ స్టేషన్ పరిదిలో ఓ కారులో 23 బ్యాగ్స్ లలో సుమారు రూ. 11 లక్షలు విలువ గల 51 కిలోల గంజాయిని నిఘా ఉంచి పెద్దపల్లి ల వద్ద తనిఖీ నిర్వహించారు.

వారి వద్ద సుమారు 6.5 కిలోల గంజాయి విలువ సుమారు 1.3 లక్షలు * స్వాధీన పరుచుకొని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్ లలో అధికారులకు అప్పగించడం జరిగింది .

పైన పేర్కున్న వ్యక్తులలో ఇంత్యజ్ శాంతి నగర్, పెద్దపల్లి పరారిలో ఉన్నాడు .

సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కమిషనరేట్ పరిదిలో మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నపటికి కూడా కొంతమంది వ్యక్తులు అమాయక యువత , విద్యార్థులకు గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కువ ధరలకు అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురేద్దేశ్యం తో అమ్ముతున్నారు .
కొంత మంది యువత చెడు అలవాట్లకు బానిసలవుతూ, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు .

కమిషనరేట్ పరిదిలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగేంచే కార్యక్రమాలు చేసే వారి వివరములు పోలీస్ లకు తెలియచేసినట్లయితే, సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది .
ఇప్పటివరకు 9 మంది పై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగింది.

అందులో గంజాయి అక్రమ రవాణా చేస్తూ కొంతమంది వ్యక్తులు, అమాయక యువత , విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై పిడి యాక్ట్ అమలు చేయడం జరిగింది అలాగే ఇంకా కొంతమంది జాబితా సిద్దం చేశాం.

త్వరలో వారిపై కూడా పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందన్నారు .
టాస్క్ ఫోర్స్ సిబ్బందిని సిపి గారు అబినందించారు.

అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ ,పి లా అర్డర్ రవి కుమార్ , ఏసీపీ గోదావరిఖని రక్షిత కె మూర్తి, అడిషనల్ డిసిపి ఎఆర్ సంజీవ్ ఉన్నారు

ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్సు సి.ఐ లు సాగర్, సరిలాల్, మరియు ఎస్.ఐ సమ్మయ్య, ఎస్.ఐ మంథని మహేందర్, ఎస్.ఐ పెద్దపల్లి, ఉపేందర్, టాస్క్ఫోర్స్,సిబ్బంది, చంద్రశేఖర్ , మహేందర్, ఎస్.శ్రీనివాస్, ప్రకాష్, ఎ.సదానదం, కే.శ్రీనివాస్, మల్లేష్, కళ్యాణ్, సదయ్యగౌడ్ , శేఖర్, సంపత్ కుమార్, శ్యాంసుందర్, భాస్కర్ గౌడ్, ఓంకార్, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.