రెండో అసెంబ్లీలో సీనియర్ (వయసు రీత్యా వనమా వెంకటేశ్వరావు), జూనియర్ .. (బానోతు హరిప్రియ)

0
99

హైదరాబాద్ :

assembly

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా కొలువుదీరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మ్యెలేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ ఇంగ్లీష్‌లో ప్రమాణస్వీకారం చేయగా.. మిగతా నలుగురు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు.

(vanama venkateshwar rao - banothu haripriya)
(vanama venkateshwar rao                            banothu haripriya)

అయితే ఈ సారి సభలో సీనియర్ ఎమ్మెల్యే కేసీఆర్(8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు) కాగా, వయసు రీత్యా వనమా వెంకటేశ్వరావు(73) సీనియర్ సభ్యుడు. వనమా వెంకటేశ్వరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. ఇక అత్యంత పిన్న వయసు బానోతు హరిప్రియది. ఆమె వయసు 29 సంవత్సరాలు.. కాగా ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు.

ఇక ఉమ్మడి అసెంబ్లీలో సభ్యులుగా ఉండి ప్రస్తుతం ఎన్నికైన వారు -16, గత అసెంబ్లీలో సభ్యులుగా ఉండి మళ్లీ ఎన్నికైన వారు -76, పూర్తిగా కొత్తవారు -23, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎంపీలు -02, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్సీలు -03, ముస్లిం మైనార్టీ సభ్యులు -08, మహిళా సభ్యులు -6, ఆంగ్లో ఇండియన్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఎంపికైన ఇద్దరు ఎంపీలు.. బాల్క సుమన్, సీహెచ్ మల్లారెడ్డి, ముగ్గురు ఎమ్మెల్సీలు.. మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా….

mla w1 mla w11 mla w1 gongidisunitha mla w1 rekhanaik